Homeతాజావార్తలుToday Gold Prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

Today Gold Prices | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

Today Gold Prices | కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు ఎగిసిపడుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పది గ్రాముల బంగారం ధర లక్షా 30 వేల మార్క్ దాటగా, వెండి కూడా కిలోకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు చెరుకొని మ‌ళ్లీ త‌గ్గింది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు ఎగిసిపడుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పది గ్రాముల బంగారం ధర లక్షా 30 వేల మార్క్ దాటగా, వెండి కూడా కిలోకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు చెరుకొని మ‌ళ్లీ త‌గ్గింది.

దేశంలో బంగారం ధరలు Gold Prices రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి క్షీణించడమూ బంగారం ధరల పెరుగుదలకు తోడ్పడుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,30,680కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,790గా ఉంది.

Today Gold Prices | కాస్త ఉప‌శ‌మ‌నం..

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,30,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,940గా నమోదైంది. హైదరాబాద్‌, విజయవాడ, ముంబై Mumbai, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణే వంటి నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,30,680గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,790గా ఉంది. వడోదరలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,730గా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,19,840గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు Silver Prices మాత్రం పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 1,89,900గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ. 1,71,900గా ఉంది. ముంబైలో వెండి ధర రూ. 1,71,900గా, బెంగళూరులో మాత్రం కొంచెం ఎక్కువగా రూ. 1,79,900గా నమోదైంది. మొత్తానికి బంగారం ధరలు ఎగిసిపడుతుండగా, వెండి మార్కెట్ మాత్రం నిలకడగా ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.