Homeతాజావార్తలుToday Gold Prices | ప‌సిడి ప్రియుల‌కు షాక్.. రూ. ల‌క్షా ముప్పై వేల‌కు చేరుకున్న...

Today Gold Prices | ప‌సిడి ప్రియుల‌కు షాక్.. రూ. ల‌క్షా ముప్పై వేల‌కు చేరుకున్న బంగారం ధ‌ర‌..!

Today Gold Prices | బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చే వార్త ఇది. బంగారంపై డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ప్రభావంతో ధరలు మరింత ఎగబాకాయి. ఈ రేట్లు చూసి సామాన్యులు ఉలిక్కి ప‌డుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | బంగారం Gold కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చే వార్త ఇది. బంగారంపై డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ప్రభావంతో ధరలు మరింత ఎగబాకాయి. ఈ రేట్లు చూసి సామాన్యులు ఉలిక్కి ప‌డుతున్నారు.

దేశవ్యాప్తంగా బంగారం ధరలు Gold Prices రోజురోజుకూ పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, గ్లోబల్ మార్కెట్లలో ఉద్రిక్తతలు, డాలర్ బలపడటం కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

దీనివల్ల బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరుగుతూ పోతోంది. రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే క్షీణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు దోహదపడుతోంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబరు 20న) దేశంలో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,30,850కి చేరగా, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) ధర రూ. 1,19,940 వద్ద నమోదైంది.

Today Gold Prices | పైపైకి బంగారం ధ‌ర‌లు..

  • రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,31,000, 22 క్యారెట్ల ధర రూ. 1,20,090గా ఉంది.
  • హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం Gold రేటు రూ.1,30,850గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల రేటు రూ. 1,19,940గా కొనసాగుతోంది.
  • వడోదరలో 24 క్యారెట్ ధర రూ. 1,30,900, 22 క్యారెట్ రూ. 1,19,990గా ఉంది.
  • ముంబయి, పుణె, కేరళలో కూడా ఇదే స్థాయిలో బంగారం ధరలు నమోదయ్యాయి.

ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌ Hyderabad, విజయవాడ Vijayawada, చెన్నై Chennai, కేరళలో కిలో వెండి ధర రూ. 1,89,900గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, వడోదర, అహ్మదాబాద్‌లలో రూ. 1,71,900గా కొనసాగుతోంది. బెంగళూరులో Bangalore మాత్రం కిలో వెండి ధర రూ. 1,79,900గా ఉంది.

మొత్తంగా చూస్తే, ప్రపంచ మార్కెట్లలో పెరుగుతున్న అనిశ్చితి పరిస్థితులు, కరెన్సీ మార్పిడి రేట్ల ప్రభావం, అలాగే పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా బంగారం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా పసిడి ధరల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది.