అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెట్టుబడిదారుల మూడ్ మారడం, రూపాయి విలువ తగ్గడం వంటి కారణాలతో బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
డాలరుతో Dollar పోల్చితే రూపాయి rupee క్షీణించడమూ బంగారానికి అదనపు బలాన్నిచ్చింది. సురక్షిత పెట్టుబడి అవకాశాల వైపు మొగ్గు చూపుతున్న ఇన్వెస్టర్లు బంగారాన్ని ప్రధానంగా ఎంచుకుంటుండటంతో డిమాండ్ పెరిగింది.
ఈ ప్రభావంతో అక్టోబరు 2న దేశవ్యాప్తంగా బంగారం ధర గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ Hyderabad, విజయవాడ Vijayawada వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ. 1,09,310కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే సుమారు రూ. 2,000 మేర ఈ పెరుగుదల నమోదైంది.
Today Gold Prices | పైపైకి బంగారం ధరలు..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,19,400 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,09,460గా ఉంది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుండగా.. ముంబయి, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి.
మరోవైపు వెండి ధరల విషయంలో స్వల్ప తగ్గుదల కనిపించింది. నిన్నటితో పోల్చితే వెండి ధరలు Silver price సుమారు రూ. 100 మేర తక్కువగా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో పండుగ సమయంలో బంగారం కొనే ప్లాన్ వేసుకునే వినియోగదారులు ఇది ఆలోచించాల్సిన సమయం. ధరలు ఇంకా పెరిగే అవకాశముందా.. లేదా.. అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. దేశంలోని ప్రధాన నగరాలలో ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
చెన్నై Chennai లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,400 గా నమోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,510 గా ట్రేడ్ అయింది.
ఢిల్లీ Delhi లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,470 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,460 గా నమోదైంది. ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,310గా నమోదైంది.
ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,310 గా ట్రేడ్ అయింది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,310 గా నమోదైంది.
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,250 గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,310 గా నమోదైంది.