Homeబిజినెస్​Today Gold Prices | గోల్డ్ ఆల్ టైం రికార్డ్ .. 24 క్యారెట్ల బంగారం...

Today Gold Prices | గోల్డ్ ఆల్ టైం రికార్డ్ .. 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే..

Today Gold Prices | పసిడి కొనుగోలుదారులకు అక్టోబరు 10న భారీ షాక్ తగిలింది. కంటిన్యూగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగి, కొత్త రికార్డును సృష్టించాయి.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | బంగారం కొనుగోలుదారులకు అక్టోబరు 10న భారీ షాక్ తగిలింది. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగి, మరోసారి కొత్త రికార్డు స్థాయిని తాకాయి.

అంతర్జాతీయంగా అమెరికా షట్‌డౌన్ ప్రమాదం, ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, డాలరు విలువ పతనం వంటివి బంగారం పెరుగుద‌ల‌కి ప్ర‌ధాన కార‌ణాలు అవుతున్నాయి.

బంగారం ధరలు Gold Prices చరిత్ర సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగులు, అమెరికా ఆర్థిక అనిశ్చితి, ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, డాలరు విలువ పతనం ఈ అన్ని అంశాలు కలిసి బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేశాయి.

2025లో ఇప్పటివరకు పసిడి ధర సుమారు 50 శాతం పెరగడం విశేషం. అక్టోబరు 10న ఉదయం సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 24 carat gold ధర తులానికి రూ.220 పెరిగి రూ.1,24,150కి చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల నగల బంగారం 22 carat gold ధర తులానికి రూ.200 పెరిగి రూ.1,13,800కి చేరింది. గ‌త నాలులు రోజులుగా బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతుండ‌టం ఆందోళనకరం.

అంతర్జాతీయంగా, స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4000 డాలర్ల మైలురాయి దాటి, కొంత తగ్గుదలతో ప్రస్తుతం 3990 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

దీంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని భద్రత కలిగిన పెట్టుబడి ఎంపికగా చూసి కొనుగోళ్లు పెంచుతుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.

Today Gold Prices | ఆల్ టైం రికార్డ్..

వెండి కూడా బంగారంతో పాటు ప‌రుగులు పెడుతుంది. ఈరోజు వెండి ధర కిలోకు రూ.7000 మేర పెరిగి, హైదరాబాద్ మార్కెట్లో రూ.1,77,000కి చేరింది. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే అత్యధికం.

ఢిల్లీ, ముంబయి Mumbai వంటి మార్కెట్లలో కిలో వెండి రూ.1,67,000 వద్ద ట్రేడవుతోంది. డాలరు dollar విలువ ఈ ఏడాదిలో దాదాపు 10 శాతం తగ్గింది.

దీనివల్ల బంగారం ధరలకు మరింత ఊతమిచ్చే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల కోతల అంచనాలు, పాలసీ అనిశ్చితులు భవిష్యత్‌లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాన్ని చూపిస్తున్నాయి.

ఇక్క‌డ గమనించాల్సిన విషయం ఏమంటే, బులియన్ మార్కెట్లో ధరలు రోజులో రెండుసార్లు మారుతుంటాయి. ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో రేట్లు Rates భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

అలాగే నగరానికి అనుగుణంగా ధరల్లో తేడా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొనుగోలుకు ముందు తాజా రేట్లు తెలుసుకోవడం బెటర్.