అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశవ్యాప్తంగా పసిడి ధరలు Gold Rates క్రమంగా తగ్గుతుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో అక్టోబర్ వరకు వరుసగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, నవంబర్ నెల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి.
ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి ధరలు క్రమంగా తగ్గుతుండటంతో సాధారణ కొనుగోలుదారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బంగారంపై డిమాండ్‌ను పెంచాయి.
పెట్టుబడులు కూడా బంగారం వైపే మరలడంతో ధరలు వరుసగా పెరిగాయి. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు కూడా రేట్ల పెరుగుదలకు కారణమయ్యాయి.
Today Gold Prices | తగ్గిన ధరలు..
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తగ్గిపోయాయి. అమెరికా షట్‌డౌన్ ముగిసిన తర్వాత ఆర్థిక గణాంకాల విడుదల ఆలస్యమైంది. దాంతో ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టమైన అంచనాకు రాకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం, సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోత జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది, అందుకే బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.
హైదరాబాద్‌లో Hyderabad కూడా బంగారం ధరలు పడిపోయాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు తగ్గి
తులానికి ₹1,14,500గా ఉంది. కిందటి రోజు కంటే ₹550 పడిపోయింది.
అక్టోబర్ 17న నమోదు చేసిన ఆల్‌టైమ్ హై: ₹1,21,700 కాగా, ఇప్పటి ధర ఆ గరిష్ఠంతో పోలిస్తే సుమారు ₹8,000 తక్కువ అని చెప్పాలి.
ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,760 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,500గా ట్రేడ్ అయింది. ఇక ఒక కేజీ వెండి ధర రూ. 1,57,500 గా పలుకుతోంది.
బంగారం ధరలు వరుసగా పడిపోవడం వినియోగదారులకు మంచి అవకాశం. పెట్టుబడిదారులు, జువెలరీ మార్కెట్ Jewellery రెండూ ధరల్లో కూడా ఈ కూలింగ్ ట్రెండ్‌ను గమనించవచ్చు. సమీప రోజుల్లో కూడా రేట్లు స్వల్పంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
