అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today gold price | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతపై ఉన్న ఆశలు తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు వస్తోంది. ఆ ప్రభావం భారత్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. బుధవారం (నవంబర్ 5) ఉదయం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,540 గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.800 మేర తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.3,200 మేర తగ్గి రూ.1,50,900కు చేరింది.
Today gold price | స్వల్ప తగ్గుదల..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 3,969 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్ సూచీ (Dollar Index) 0.12 శాతం మేర పెరిగి 88.71 రూపాయలకు చేరింది. గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడంతో బంగారం ధరలు మరింత ఒత్తిడికి గురయ్యాయి. ఈ వారం మొత్తం బంగారం ధరల్లో దిద్దుబాట్లు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.1,22,720, 22 క్యారెట్ల రేటు రూ.1,12,490, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, కేరళ, పూణె నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1,22,450, 22 క్యారెట్ల రేటు రూ.1,12,240, ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.1,22,500, ఇక 22 క్యారెట్ల ప్రైస్ రూ.1,12,390, అలాగే వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,22,500, 22 క్యారెట్లు రూ.1,12,290గా నమోదయ్యాయి.
వెండి ధరలు కూడా నగరాలవారీగా గణనీయంగా తగ్గాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు Bangalore, పూణె, వడోదరా, అహ్మదాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,50,900గా నమోదైంది. కాగా.. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో వెండి ధర రూ.1,64,900గా ఉంది. ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. డాలర్ బలపడుతుండగా బంగారం ధరలు మరికొన్ని రోజులు తగ్గే అవకాశం ఉంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చేవరకు పసిడి మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారు చెబుతున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాల పెట్టుబడిదారుల దృష్టిలో బంగారం ఇప్పటికీ సేఫ్‌గానే పరిగణించబడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.