Homeబిజినెస్​Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతంటే..!

Today Gold Price | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price | గ‌త కొద్ది రోజులుగా భారీగా పెరుగుకుంటూ పోయిన బంగారం ధ‌ర‌లు ఈ రెండు రోజుల నుంచి స్వ‌ల్పంగా త‌గ్గుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, US డాలర్ అస్థిరత వంటి ఇటీవలి ప్రపంచ భౌగోళిక, రాజకీయ కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుండ‌డం మనం చూస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్‌లో కనిపిస్తోంది. జూన్ 24న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,680 ఉండగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల ధర 92,290 రూపాయల వద్ద ఉంది. ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి.

Today Gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇప్పటివరకు బంగారం ధర పెద్దగా పెరగలేదు. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసినప్పటికీ, సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.27% తగ్గింది. భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం మధ్యాహ్నం బంగారం Gold ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రూపాయి బలహీనత భారతదేశంలో బంగారం ధరలకు మద్దతు ఇస్తుండ‌డం విశేషం. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు చూస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర 1,00,830 ఉండగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల ధర 92,440 రూపాయలు ఉంది.

ముంబయిలో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,680 ఉండగా, అదే 22 క్యారెట్​ల 10 గ్రాముల ధర రూ. 92,290 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,680 ఉండగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల ధర రూ. 92,290 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి Silver ధర విషయానికొస్తే ఇది కూడా స్వల్పంగానే తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,00,990 వద్ద ఉంది. బంగారం కొనాల‌ని అనుకునే వారు ఈ రోజు ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రానున్న రోజుల‌లో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం కూడా ఉంది.

Must Read
Related News