Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌లు.. ఏకంగా ల‌క్ష మార్కు దాటేసిందిగా..!

Today Gold Price | త‌గ్గ‌నంటున్న బంగారం ధ‌ర‌లు.. ఏకంగా ల‌క్ష మార్కు దాటేసిందిగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు తగ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే ఈ మ‌ధ్య బంగారం ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తగ్గుతోంది కదా అని సంతోషపడేలోపు.. షాకుల మీద షాకులు ఇస్తోంది.

స్వచ్ఛమైన 24 క్యారెట్​ల బంగారం ధర మళ్లీ లక్ష దాటింది. పది రోజుల క్రితం 96 వేల నుంచి 97 వేల రూపాయల మధ్య ట్రేడ్ అయింది. రెండు, మూడు రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగాపైకి ఎగబాకింది. రెండు నెలల క్రితం లక్ష మార్కు దాటిన పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ లక్ష దాటి పరుగులు పెడుతోంది. వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.

Today Gold Price : భ‌య‌పెట్టిస్తున్న బంగారం..

జూన్ 15 2025 ఆదివారం దేశీయంగా 24 క్యారెట్​ల బంగారం(24-carat gold) పది గ్రాముల ధర 1,01,680 ఉండగా.. 22 క్యారెట్​ల ధర 93,200 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,10,000లుగా ఉంది.

హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్​ల బంగారం ధర రూ.1,01,680 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.93,200 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి Silver ధర రూ.1,20,000లగా ఉంది.

విజయవాడ(Vijayawada), విశాఖపట్నం (Visakhapatnam)లో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.1,01,680 ఉంటే.. 22 క్యారెట్​(22-carat)ల ధర రూ.93,200లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది.

ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్​ల పసిడి(24-carat gold) ధర రూ.1,01,830, 22 క్యారెట్​ల ధర రూ.93,350 గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,000 గా ఉంది.

ముంబయి(Mumbai)లో 24 క్యారెట్​ల ధర రూ.1,01,680, 22 క్యారెట్​(22-carat)ల ధర రూ.93,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 గా ఉంది.

చెన్నై(Chennai)లో 24 క్యారెట్​ల ధర రూ.1,01,680 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.93,200 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 గా ఉంది.

బెంగళూరు(Bangalore)లో 24 క్యారెట్​ల ధర రూ.1,01,680, 22 క్యారెట్​ల ధర రూ.93,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 గా ఉంది.

గత 10 రోజుల నుంచి వెండి(Silver) ధరలు కూడా అనుకోని షాక్ ఇస్తున్నాయి. పెరుగుతూ పోతున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరలు పెరగలేదు.. తగ్గలేదు.

Must Read
Related News