అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు (Gold rates) పరుగులు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో కొనుగోలు దారులకు ఇది మంచి అవకాశంగా మారింది.
గురువారం రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,380 తగ్గి రూ.1,00,960గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,540కి పడిపోయింది. వెండి ధర కూడా రూ.2,000 తగ్గి కిలోకు రూ.1,17,100కి చేరింది. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Today Gold Price : కాస్త తగ్గిన ధరలు..
దేశంలోని నగరాల వారీగా బంగారం, వెండి ధరలు చూస్తే..
- హైదరాబాద్ Hyderabad లో 24 క్యారెట్ల బంగారం (24-carat gold) 10 గ్రాములకు గాను రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి Silver కిలోకు రూ.1,27,900 గా ట్రేడ్ అయింది.
- దేశ రాజధాని ఢిల్లీ Delhi లో 24 క్యారెట్ల బంగారం (24-carat gold) రూ.1,01,110 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.92,690, వెండి కిలోకు రూ.1,17,900గా నమోదైంది.
- ముంబయి Mumbai లో 24 క్యారెట్ల బంగారం (24-carat gold) రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,490, కిలో వెండి ధర రూ.1,17,900.
- చెన్నై Chennai లో 24 క్యారెట్ల బంగారం (24-carat gold) రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,27,900గా ట్రేడ్ అయింది.
- ఇక బెంగళూరులో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (24-carat gold) రూ.1,00,960, 22 క్యారెట్ల బంగారం రూ.92,540, వెండి కిలోకు రూ.1,17,900గా నమోదైంది.
ఈ ధరలు నగరాల మధ్య స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి మారుతుంటాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరల తగ్గుదల వెనుక ముఖ్యమైన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఒడుదుడుకులు. గ్లోబల్ ఎకానమీలో అనిశ్చితి, డాలర్ బలపడటం, సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాలు బంగారం రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. డాలర్ Dollar బలపడితే బంగారం ధర సాధారణంగా తగ్గే అవకాశముంటుంది. పారిశ్రామిక డిమాండ్ లో క్షీణత రావడం, గ్లోబల్ ఉత్పాదన మందగించడంతో వెండి ధరలు కూడా పడిపోయాయి.
