Homeబిజినెస్​Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఆందోళ‌నలో కొనుగోలుదారులు

Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఆందోళ‌నలో కొనుగోలుదారులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి Silver ధరలు క్ర‌మంగా పెరుగుతూ, వినియోగదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం, జులై 24న బంగారం ధరలు భారీగా పెరిగాయి.

వరుసగా రెండో రోజు ఇదే ధోరణి కనిపించడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పెట్టుబడిదారులకి మాత్రం ఇది మంచి అవకాశం. ఈ రోజు బంగారం ధరలు (Gold Prices Today) చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,040 పెరిగి రూ.1,02,340గా ట్రేడ్ అయింది. 22 క్యారెట్ల బంగారం 22 carat gold (10 గ్రాములు) రూ.93,810గా న‌మోదైంది.

Today Gold Price : మ‌ళ్లీ పెరిగిన ధ‌ర‌లు..

ఇక వెండి ధరలు చూస్తే.. (Silver Prices Today) వెండి ధర (కిలోకు) రూ.1,000 పెరిగి రూ.1,19,100గా ట్రేడ్ అయింది. ప్రధాన నగరాల్లో బంగారం ధ‌ర‌లు చూస్తే..

  • హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల బంగారం 24-carat gold ధర 10 గ్రాములకు రూ.1,02,340గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810గా రికార్డ్ అయింది. వెండి ధర కిలోకు రూ.1,19,100 గా ఉంది.
  • ఢిల్లీ Delhi లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,490 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,960గా ట్రేడ్ అయింది. ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.1,19,100గా ట్రేడ్ అయింది.
  • చెన్నై Chennai లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,02,340 ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810గా ఉంది. వెండి ధర కిలోకు రూ.1,19,100గా న‌మోదైంది.
  • ముంబయిలో Mumbai కూడా అవే ధరలు నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,340గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,810గా ఉంది. వెండి ధర రూ.1,19,100గా ఉంది.

కోల్‌కతా, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో కూడా ఇవే ధ‌ర‌లు క‌నిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు కారణమవుతున్నాయి. డాలర్ బలపడటం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ పెరగడం, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెరగడం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, పారిశ్రామిక అవసరాలకు వెండి డిమాండ్ పెరగడం కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. గత 10 రోజుల్లో బంగారం ధరలు రూ3,000 నుండి రూ. 4,000 వరకు పెరిగాయి.

Must Read
Related News