Homeబిజినెస్​Today Gold Price | పసిడి పరుగులు.. నేడు ఎంత పెరిగాయంటే..!

Today Gold Price | పసిడి పరుగులు.. నేడు ఎంత పెరిగాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు సామాన్యుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ శుభకార్యం అయినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే కాబ‌ట్టి ఇటీవ‌లి కాలంలో గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్కలు చూపిస్తున్నాయి.

ఇక త్వరలో శ్రావణమాసం రానుండ‌గా, శుభ‌కార్యాల కోసం బంగారం కొనే ఆస‌క్తి చూపుతున్నారు. కానీ, రోజు రోజుకి ఇలా గోల్డ్ రేట్స్ పెరుగుతుండ‌టం ఏ మాత్రం మింగుడుప‌డ‌టం లేదు. గత వారం రూ. 98,000 పరిధిలో ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు మళ్లీ లక్ష రూపాయల మార్క్‌ను చేరుకుంటోంది. నిపుణుల అంచనా ప్రకారం, బంగారం ధరలు త్వరలోనే లక్ష రూపాయలను దాటి ట్రేడ్ కావొచ్చు.

Today Gold Price : త‌గ్గుతున్న వెండి ధ‌ర‌లు..

జులై 15న 24 క్యారెట్ల బంగారం (24 carats gold) (10 గ్రాములు): ₹99,890 కాగా, 22 క్యారెట్ల బంగారం 22 carats gold (10 గ్రాములు): ₹91,560. నిన్నటి తో పోల్చితే, రెండు వందల రూపాయల వరకు బంగారం పెరిగిన‌ట్టు తెలుస్తోంది.

Today Gold Price : ముఖ్య నగరాల్లో..

ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) ప‌రంగా చూస్తే.. హైదరాబాద్ Hyderabad లో 24 క్యారెట్ గోల్డ్ ₹ 99,890 , 22 క్యారెట్ పసిడి ₹ 91,560 గా ఉంది. మిగతా నగరాలను పరిశీలిస్తే, తులం గోల్డ్ కు 24 క్యారెట్​, 22 క్యారెట్ ధరలు వరుసగా…​

  • విజయవాడ (Vijayawada)లో రూ.99,890 , రూ.91,560
  • ఢిల్లీలో రూ.1,00,040, రూ.91,710
  • ముంబయిలో రూ.99,890, రూ.91,560
  • వడోదరలో రూ.99,940, రూ.91,610
  • కోల్‌కతా (Kolkatha) రూ.99,890, రూ. 91,560
  • చెన్నైలో రూ.99,890, రూ.91,560
  • బెంగళూరులో రూ.99,890, రూ.91,560
  • కేరళలో రూ.99,890, రూ.91,560
  • పుణె Pune లో రూ.99,890, రూ.91,560గా ట్రేడ్ అవుతోంది.

ఇక వెండి Silver ధరలు (కిలోకి) విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ (Hyderabad)లో రూ.1,24,900, విజయవాడలో రూ.1,24,900, ఢిల్లీ Delhi లో రూ.1,14,900, చెన్నైలో రూ.1,24,900, కోల్‌కతాలో రూ.1,14,900, కేరళ (KERALA)లో రూ.1,24,900, ముంబయి (Mumbai)లో రూ.1,14,900, బెంగళూరు (Bengaluru) లో రూ.1,14,900, వడోదరలో రూ.1,14,900, అహ్మదాబాద్‌ లో రూ.1,14,900గా న‌మోదైంది. వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద మేర తగ్గడం కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించింది.

Must Read
Related News