అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jan 05 Gold Prices | | సంక్రాంతి పండగ (Pongal Festival) సమీపిస్తున్న వేళ బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చే వార్త వచ్చింది. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపించిన బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో (international markets) నెలకొన్న పరిణామాలు, ముఖ్యంగా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలపై (Gold Prices) ఒత్తిడి ఏర్పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో పసిడి పరుగులకు బ్రేక్ పడినట్టుగా కనిపిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, సంక్రాంతి షాపింగ్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్తనే చెప్పాలి.
Jan 05 Gold Prices | బంగారం ధరలు తగ్గుముఖం..
నేటి (జనవరి 5, సోమవారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,35,810గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,24,490గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,01,860గా ట్రేడ్ అయింది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,37,450, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,25,990గా ఉంది. వెండి (కిలో): రూ.2,56,900గా నమోదైంది. ఇక ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,40,900గా ట్రేడ్ అయింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,960, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,640,
వెండి (కిలో): రూ.2,40,900గా ట్రేడ్ అయింది.
ఇక కోల్‌కతాలో (Kolkata) 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,40,900గా ట్రేడ్ అయింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,40,900గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,56,900గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,56,900గా ట్రేడ్ అయింది. విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,35,810గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రా): రూ.1,24,490, వెండి (కిలో): రూ.2,56,900గా ఉంది.