అక్షరటుడే, వెబ్డెస్క్: Dec 28 Gold Price | బంగారం, వెండి ధరలు Silver Prices రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే, మరుసటి రోజే దానికి రెట్టింపుగా పెరుగుతూ సామాన్యుడికి పెద్ద భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం గ్రాము బంగారం కొనడం కూడా కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది.
తాజాగా డిసెంబర్ 28న బంగారం ధరలు (Gold Prices) మళ్లీ దూసుకుపోయాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,220గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా నమోదైంది. ఇవి ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు మాత్రమే. ఉదయం 10 గంటల తర్వాత బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకోవచ్చు. రోజులో ఎప్పుడైన ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగవచ్చు. కాగా, నిన్న ఒక్కరోజే తులం బంగారం ధర రూ.1,200 వరకు పెరగడం గమనార్హం.
Dec 28 Gold Price | ఇప్పట్లో తగ్గేలా లేదు..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే .. హైదరాబాద్లో Hyderabad 24 క్యారెట్లు – రూ.1,41,220 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్లు – రూ.1,29,450గా నమోదైంది. విజయవాడ:24 క్యారెట్లు – రూ.1,41,220 | 22 క్యారెట్లు – రూ.1,29,450, ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,41,370 | 22 క్యారెట్లు – రూ.1,29,600, ముంబై: 24 క్యారెట్లు – రూ.1,41,220 | 22 క్యారెట్లు – రూ.1,29,450, చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,41,820 | 22 క్యారెట్లు – రూ.1,30,000 బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,41,220 | 22 క్యారెట్లు – రూ.1,29,450, కేరళ:24 క్యారెట్లు – రూ.1,41,220 | 22 క్యారెట్లు – రూ.1,29,450గా ట్రేడ్ అయింది.
ఇక వెండి ధరల పరిస్థితి ఏంటనేది చూస్తే.. వెండి ధరలు కూడా బంగారానికి పోటీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.2,51,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళ Kerala వంటి ప్రాంతాల్లో కూడా వెండి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కిలో ధర రూ.1,74,000గా నమోదవుతోంది. పండుగలు, వివాహాల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం, వెండిపై డిమాండ్ పెరుగుతుండటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇక రానున్న రోజుల్లో ధరలు ఏ మేరకు పెరుగుతాయోనన్న ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.