అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices ఎప్పటికప్పుడు ఊగిసలాటలకు గురవుతూ సాధారణ వినియోగదారులను గణనీయంగా ఇబ్బంది పెడుతున్నాయి. స్వల్ప తగ్గుదల, తదుపరి రోజునే మళ్లీ భారీగా పెరుగుతున్న ధరలు సామాన్య కుటుంబాలకి బంగారాన్ని మరింత దూరంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మనందరికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. డిసెంబర్ 12 ఉదయం నమోదైన బులియన్ ధరలు పీక్స్‌కి చేరాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర తులానికి ₹1,30,760 ఉండగా, వెండి ధర కిలోకు ₹2,01,100గా కొనసాగుతోంది.
Today Gold Prices | పెరుగుదలకు కారణాలు..
దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు (డిసెంబర్ 12) చూస్తే..
- ఢిల్లీలో 24 క్యారెట్లు (10 gm): ₹ 1,30,910 – 22 క్యారెట్లు (10 gm): ₹ 1,20,100గా ఉంది.
- ముంబైలో Mumbai 24 క్యారెట్లు (10 gm): ₹ 1,30,760గా ట్రేడ్ కాగా – 22 క్యారెట్లు (10 gm): ₹ 1,19,860గా నమోదైంది.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్లు (10 gm): ₹ 1,30,760 – 22 క్యారెట్లు (10 gm): ₹ 1,19,860
- విజయవాడలో 24 క్యారెట్లు (10 gm): ₹ 1,30,760గా ట్రేడ్ కాగా – 22 క్యారెట్లు (10 gm): ₹ 1,19,860గా నమోదైంది.
- బెంగళూరులో 24 క్యారెట్లు (10 gm): ₹ 1,30,760 కాగా – 22 క్యారెట్లు (10 gm): ₹ 1,19,860గా ట్రేడ్ అయింది.
- ధరలు పెరగడానికి కారణాలేమిటి అనేది చూస్తే.. బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక పలు అంతర్జాతీయ మరియు దేశీయ కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు:
ఉత్సవాలు, పెట్టుబడులు, ఆర్థిక అనిశ్చితి మధ్య ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ధరలు ఆటోమేటిక్‌గా దూసుకెళుతున్నాయి. మరోవైపు ఆర్థిక ఒత్తిడులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పులు డాలర్ బలహీనతకు దారితీశాయి. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. రష్యా–ఉక్రెయిన్, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడిదారులను రిస్కీ ఆస్తుల నుంచి దూరం చేసి.. బంగారం, వెండి Silver వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు తులానికి ₹ 30,000–40,000 మధ్య ఉండే బంగారం ధరలు ఇప్పుడు రూ. లక్షా 30 వేల మార్క్‌ను దాటి పరిగెత్తుతుండటంతో సాధారణ ప్రజలు ఆభరణాల కొనుగోళ్ల ఆశనే వదిలేసుకుంటున్నారు. గ్రాము బంగారం కొనాలంటే కూడా భయపడే రోజులు వచ్చాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.