అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు Gold Rates చివరికి బ్రేక్ పడింది. స్థానిక బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే రూ.300 వరకు పడిపోయిన బంగారం ధరలు, డిసెంబర్ 10న మరింత తగ్గి కొనుగోలుదారులకు తీపి కబురు అందించాయి.
ఇటీవలి కాలంలో తులం బంగారం ధర రూ.1,30,430 వద్ద ఉన్నప్పటికీ, ప్రస్తుతం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడడం, పెట్టుబడిదారులు గోల్డ్లోనుండి నిధులను ఉపసంహరించుకొని ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లించడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Today Gold Prices | హెచ్చు తగ్గులు..
హైదరాబాద్లో Hyderabad తాజా ధరలు చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములు: రూ. 1,29,430గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాములు: రూ. 1,18,640గా నమోదైంది. కొద్ది రోజుల క్రితం పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా ధరలు భారీగా పెరిగిన నేపథ్యం చూస్తే, ఈ తగ్గుదల వినియోగదారులకు కొంత ఊరటనిచ్చేలా ఉంది.
అయినప్పటికీ తులం బంగారం కొనాలంటే ఇంకా రూ. 1.30 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. బంగారం తగ్గినా వెండి ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,99,100గా ట్రేడ్ అయింది అంటే దాదాపు లక్షల దగ్గరకు చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే వెండి ధర రూ. 1,90,100 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
- విజయవాడలో Vijaywada 24 క్యారెట్లు: రూ. 1,29,430 – 22 క్యారెట్లు: రూ. 1,18,640గా ట్రేడ్ కాగా,
- చెన్నైలో 24 క్యారెట్లు: రూ. 1,30,900 – 22 క్యారెట్లు: రూ. 1,19,990
- ముంబైలో 24 క్యారెట్లు: రూ. 1,29,430 – 22 క్యారెట్లు: రూ. 1,18,640
- ఢిల్లీలో 24 క్యారెట్లు: రూ. 1,29,580 – 22 క్యారెట్లు: రూ. 1,18,790గా ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరల్లో వచ్చిన ఈ పతనం శాశ్వతం కాదు. అంతర్జాతీయ పరిస్థితులు, వడ్డీ రేట్ల మార్పులు, డాలర్ విలువలపై ఆధారపడి ధరలు మరోసారి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. తదుపరి కొన్ని రోజులు ధరల్లో హెచ్చుతగ్గులు తప్పవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.