Gold Price On August 29 | షాకిస్తున్న గోల్డ్.. ఇంకా పెరిగిన ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..
Gold Price On August 29 | షాకిస్తున్న గోల్డ్.. ఇంకా పెరిగిన ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప్రతి రోజూ బంగారం, వెండి Silver ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి స్వల్పంగా తగ్గినా.. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతున్నాయి.

గతంలో తులం బంగారం ధర రూ.90,000ల వరకు ఉన్నప్పటికీ, ఇప్పుడు రూ. లక్షను కూడా దాటేసింది. గత రెండు రోజులలోనే తులం బంగారం ధర దాదాపు రూ.3,000 వరకు పెరిగింది. మంగళవారం కంటే బుధవారం (ఆగస్టు 6న) తులంపై రూ.900 పెరిగింది.

ఈ పెరుగుదల బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఆందోళ‌న క‌లిగిస్తోంది. పెళ్లిళ్ల స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు ఇలా పెరుగుతూ పోతే ఎలా కొన‌గ‌లుగుతామని కొంద‌రు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

Today Gold Price : భ‌గ్గుమంటున్న బంగారం..

ఆగస్టు 6, ఉదయం నాటికి 24 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 1,02,230 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 93,710 , 18 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 76,680 గా న‌మోదైంది. ఇక ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,380గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,860 ఉంది.
  • హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,230 గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,710గా ట్రేడ్ అయింది.
  • విజయవాడ(Vijaywada)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02230 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,710 ఉంది.
  • ముంబయి(Mumbai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02230 కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,710 ఉంది.
  • చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02230 కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,710 ఉంది.
  • బెంగళూరు(Bengaluru)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02230 గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,710 ఉంది.

ఇక కిలో వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే 2000 రూపాయల వరకు పెర‌గ‌డంతో ప్రస్తుతం కిలో వెండి Silver ధర రూ. లక్షా 15 వేలుగా ఉంది. ధరల పెరుగుదల కారణంగా బంగారు ఆభరణాల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడెవరికైనా 10 గ్రాముల గోల్డ్ చైన్ కొనాలంటే కనీసం రూ. లక్ష పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.