అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోసారి భారీగా పెరిగి, లక్ష రూపాయల మార్క్‌ను దాటి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకునే దిశలో పెరుగుతున్నాయి.
గ్లోబల్ స్థాయిలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గు చూపుతుండటం వల్ల బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నట్లు కనిపిస్తోంది.
ఆగస్టు 5న నమోదైన ధరల ప్రకారం చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,410 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,960 గా ఉంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు ధరలు కొద్దిగా పెరిగాయి. తులం బంగారం కొందామంటే చేతిలో లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Today Gold Price : మళ్లీ పెరుగుదల..
ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు బంగారం ధర అంతకు రెట్టింపు పెరిగిపోతోంది. దేశంలోని ప్రధాన నగరాలలో (24 క్యారెట్ (₹), 22 క్యారెట్ (₹)) 10 గ్రాముల బంగారం ధరలు చూస్తే..
- హైదరాబాద్(Hyderabad)లో రూ. 1,01,410 – రూ. 92,960 కాగా,
- విజయవాడ(Vijayawada)లో Vijaywada రూ. 1,01,410 – రూ. 92,960
- ఢిల్లీ(Delhi)లో రూ. 1,01,560 – రూ. 93,110
- ముంబయి(Mumbai)లో రూ. 1,01,410 – రూ. 92,960
- వడోదర(Vadodara)లో రూ. 1,01,460 – రూ. 93,010
- కోల్‌కతా(Kolkata)లో రూ. 1,01,410 – రూ. 92,960
- చెన్నై(Chennai)లో రూ. 1,01,410 – రూ. 92,960
- బెంగళూరు(Bengaluru)లో రూ. 1,01,410 – రూ. 92,960
- కేరళ(Kerala)లో రూ. 1,01,410 – రూ. 92,960
- పుణె(Pune)లో రూ. 1,01,410 – రూ. 92,960 గా ట్రేడ్ అయింది.
ఇక వెండి ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,22,900 కాగా, విజయవాడలో రూ. 1,22,900, ఢిల్లీలో రూ. 1,12,900, చెన్నైలో రూ. 1,22,900, కోల్‌కతాలో రూ. 1,12,900, కేరళలో రూ. 1,22,900, ముంబయిలో రూ. 1,12,900, బెంగళూరులో రూ. 1,12,900, వడోదరలో రూ. 1,12,900, అహ్మదాబాద్ లో రూ. 1,12,900గా ట్రేడ్ అయింది.
కాగా వెండి Silver ధరలు నిన్నటితో పోల్చుకుంటే కొంత స్థిరంగానే ఉన్నాయనే చెప్పాలి. అయితే, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు ఇలా పెరుగుతూ పోతుంటే కొనుగోలుదారులు తులం బంగారం కొనాలన్నా కూడా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.