Homeబిజినెస్​Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి...

Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి ప‌సిడి ధ‌ర‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 27 : మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం Gold ధ‌ర‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం ప్రారంభించాయి. ఆగస్టు 27వ తేదీ బుధవారం నాటి బంగారం ధరలు చూస్తే..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,900గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 93,950గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే… ఒక కిలో వెండి ధర రూ. 1,19,345 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పెర‌గ‌డం, త‌గ్గ‌డానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌ US market లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 3400 డాలర్ల పరిధిలో ట్రేడవుతోంది. ఇది రికార్డ్ స్థాయితో పోల్చితే కాస్త తక్కువే అయినా.. బంగారం ధర ఎప్పటికప్పుడు పెరుగుతోంది.

Gold Price on august 27 : మ‌ళ్లీ పైపైకి..

ఇతర పెట్టుబడి అవకాశాల్లో అస్థిరత కారణంగా.. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి బంగారంపైనే దృష్టి పెట్టడం వల్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం.

డాలర్ Dollar బలహీనపడే కొద్దీ బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ ఇన్వెస్టర్లు దానిపైనే మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా చూస్తే.. ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కావడం కూడా బంగారం డిమాండ్‌ను పెంచింది. దీంతో పాటు బంగారు ఆభరణాల ధరలు పెరగడం, తయారీ చార్జీలు, జీఎస్టీ తదితర ఖర్చులు కలిపి బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,000 దాటిన నేపథ్యంలో, ఒక 10 గ్రాముల బంగారు గొలుసు కొనాలంటే అన్ని ఖర్చులు కలుపుకొని దాదాపు రూ. 1,10,000 వరకు ఖర్చు కావొచ్చు.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,02,220గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,710గా ట్రేడ్ అయింది.

ఇక చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,02,070గా న‌మోదైంది.. మ‌రోవైపు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,560గా ట్రేడ్ అయింది. ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. అటు వెండి ధరలు మాత్రం నేలచూపులు చూస్తుండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.

గడిచిన రెండు రోజుల్లో కేజీ వెండి Silver ధర రూ. 1100 మేరకు తగ్గ‌డం విశేషం. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 1,19,900గా ట్రేడ్ కాగా, హైదరాబాద్, చెన్నై, కేరళ, విజయవాడ నగరాల్లో కిలో వెండి రూ. 1,29,900గా న‌మోదైంది.