అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price on august 25 : దేశంలో బంగారం, వెండి Silver ధరలు ఇటీవల లక్ష రూపాయల పైచిలుకు స్థాయిలో కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, ఆగస్టు 25న స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఆగస్టు 25, 2025న 10 గ్రాముల 24 క్యారెట్ల 24 carat gold బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,01,610కి చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర యథాతథంగా రూ.93,140 గా ఉంది.
ఇక 1 కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900గా ట్రేడ్ అయింది. నగరాల వారీగా బంగారం ధరలు (22K / 24K) పరంగా చూస్తే.. హైదరాబాద్ లో రూ.93,140, రూ1,01,610 గా ట్రేడ్ అయింది.
Gold Price on august 25 : కాస్త ఉపశమనం..
- విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140గా ట్రేడ్ కాగా , 24 క్యారెట్ల ధర రూ.1,01,610గా నమోదైంది.
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.93,140గా ట్రేడ్ కాగా , 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా నమోదైంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,140గా ట్రేడ్ అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,610గా నమోదైంది.
- చెన్నై Chennai లో కూడా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.93,140గా నమోదు కాగా, 24 క్యారెట్ల బంగారం Gold రూ.1,01,610గా ట్రేడ్ అయింది. బంగారం ధరలు క్రమేపి తగ్గుతూ వస్తున్నా కూడా ఇంకా లక్షకి పైగానే ధరలు ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు కూడా బంగారంతో పాటు కాస్త తగ్గడం కొనుగోలు దారులకి కాస్త ఉపశమనం కలిగించింది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,29,900గా నమోదు కాగా , విజయవాడలో రూ.1,29,900, విశాఖపట్నంలో కేజీ వెండి రూ.1,29,900, బెంగళూరులో కిలో వెండి రూ.1,19,900, చెన్నైలో కేజీ వెండి రూ.1,29,900గా ట్రేడ్ అయింది.
ఢిల్లీ, ముంబయి (Mumbai)లో కూడా కేజీ వెండి రేటు రూ.1,19,900గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు ప్రధానంగా ఈ అంశాలపై ఆధారపడి మారుతుంటాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్, అమెరికా డాలర్ మారకం విలువ, ద్రవ్యోల్బణ స్థాయి, జియోపాలిటికల్ పరిస్థితులు (ఉక్రెయిన్-రష్యా, మిడిల్ ఈస్ట్ లాంటి పరిణామాలు), స్టాక్ మార్కెట్ Stock Market పరిణామాలు అని చెప్పొచ్చు.