Homeబిజినెస్​Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు...

Gold Price on August 24 | ప‌సిడి ప్రియుల‌కు పండుగ లాంటి వార్త‌.. నేడు ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 24 : పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వ‌స్తున్నాయంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారం. మన సంస్కృతి, సంప్రదాయాల్లో గోల్డ్‌కు ఉన్న ప్రాముఖ్యం అంతులేనిది.

పెట్టుబడిగా పసిడిని ఎంచుకునే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇటీవల గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో global market ఔన్సు గోల్డ్ ధర 3,400 డాలర్లకు దిగువన ఉంది.

నిపుణుల అంచనాల ప్రకారం, ఇది 3,340 డాలర్ల స్థాయిలో మద్దతు పొందే అవకాశముంది. తాజా గణాంకాల ప్రకారం వచ్చే నెలలో బంగారం ధరల్లో కొంత తగ్గుదల వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Gold Price on August 24 | ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆగ‌స్టు 24న (ఈ రోజు) చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 93,150 కాగా, 24 క్యారట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 1,01,620గా ఉన్నాయి.

ఇతర నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. ఢిల్లీలో Delhi 22 క్యారట్లు – రూ. 93,300, 24 క్యారట్లు – రూ. 1,01,770గా ఉంది. ముంబయి, బెంగళూరు, చెన్నైలో 22 క్యారట్లు – రూ. 93,150, 24 క్యారట్లు – రూ. 1,01,620గా న‌మోదైంది.

ఇక వెండి Silver ధరలు విష‌యానికి వ‌స్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 1,30,000గా న‌మోదైంది.

ఇక ఢిల్లీ, ముంబయి, బెంగళూరుల‌లో 1 కిలో వెండి ధర – రూ. 1,20,000గా ట్రేడ్ అయింది. చెన్నైలో చూస్తే.. 1 కిలో వెండి ధర రూ. 1,30,000గా ఉంది.

ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలపై బాగా ఆధారపడి ఉండటంతో ఎప్పుడైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వారు నిపుణుల సూచనలతో పాటు రోజువారీ ధరలపై దృష్టి పెట్టడం ఉత్తమం.

Must Read
Related News