అక్షరటుడే, వెబ్‌డెస్క్: oday Gold Price : ఇటీవల లక్ష మార్క్ దాటిన బంగారం Gold ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ క్రమంగా తగ్గడమే కాకుండా, అమెరికాలో America ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
చివరి నాలుగు రోజుల్లోనే 100 గ్రాముల బంగారం ధర సుమారు ₹18,000 వరకు తగ్గింది. కృష్ణాష్టమి, వినాయక చవితి వంటి పండుగలు దగ్గర పడుతున్న తరుణంలో ఇది వినియోగదారులకు చక్కటి అవకాశంగా మారింది. వెనుకబడిన బంగారం ధరల మధ్య, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే కేజీ వెండి ధర ₹1100 మేర పెరిగింది.
Today Gold Price : ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు (ఆగస్ట్ 15న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,01,340గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 92,890కి చేరింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.. బంగారం Gold రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) పరంగా చూస్తే..
- హైదరాబాద్‌లో రూ.1,01,340 – రూ.92,890
- విజయవాడలో రూ.1,01,340 – రూ. 92 890
- ఢిల్లీలో రూ. 1,01,490 – రూ. 93,040
- ముంబైలో రూ. 1,01,340 – రూ. 92,890
- వడోదరలో రూ. 1,01,390 – రూ. 92, 940
- కోల్‌కతాలో రూ. 1,01,340 – రూ. 92, 890
- చెన్నైలో రూ. 1,01,340 – రూ. 92,890
- బెంగళూరులో రూ. 1,01,340 – రూ. 92,890
- కేరళలో రూ. 1,01,340 – రూ. 92,890
- పుణెలో రూ.1,01,340 – రూ. 92, 890గా ట్రేడ్ అయింది.
ఇక ప్రధాన నగరాల్లో వెండి Silver ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ.1,26,100గా నమోదైంది. విజయవాడలో రూ.1,26,100గా ట్రేడ్ అయింది. ఢిల్లీలో రూ.1,16,100గా ట్రేడ్ కాగా, చెన్నైలో రూ.1,26,100, కోల్‌కతాలో రూ.1,16,100, కేరళలో రూ.1,26,100, ముంబైలో రూ.1,16,100, బెంగళూరులో రూ.1,16,100, వడోదరలో రూ.1,16,100, అహ్మదాబాద్‌లో రూ. 1,16,100గా నమోదైంది. ధరలు కాస్త తగ్గినప్పుడే బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం మంచిది.