Homeబిజినెస్​Today Gold Prices | రూ. 1.15 లక్షలు దాటిన పసిడి.. వెండి విషయానికి వస్తే..!

Today Gold Prices | రూ. 1.15 లక్షలు దాటిన పసిడి.. వెండి విషయానికి వస్తే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | దేశవ్యాప్తంగా బంగారం ధరలు Gold Prices రోజురోజుకీ పెరుగుతూ స‌రికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, డాలరుతో పోలిస్తే రూపాయి క్షీణత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.

దీంతో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,470 కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,05,840 గా నమోదైంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,15,620 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,05,990 గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,15,470 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,05,840 వద్ద నిలిచింది.

Today Gold Prices | స్థిరంగా ధ‌ర‌లు..

వెండి ధరలు Silver prices మాత్రం నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్టుబడిదారుల డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి రేట్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల‌ని ప‌రిశీలిస్తే..

ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,05,840 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,16,070 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,06,390 గా న‌మోదైంది.

బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,05,840 గా ట్రేడ్ అయింది.

ఇక వెండి ధర విషయానికొస్తే.. ఇది కూడా క్ర‌మేపి పెరుగూ పోతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. రూ. 1.49 లక్షలుగా న‌మోదు కాగా.. హైదరాబాద్‌, కేరళ, చెన్నై Chennai రాష్ట్రాల్లో రూ. 1,58,900 గా ట్రేడ్ అయింది.

గతంలో వెండి ధ‌ర‌లు పెద్దగా పెరిగేవి కావు. కానీ, ఈ మధ్య కాలం నుంచి వెండి ధర పరుగులు పెడుతుండ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏదిఏమైనా ఈ మ‌ధ్య కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా పెరుగుతూ పోతుండ‌టం మ‌హిళ‌ల‌ని ఇబ్బందుల‌కి గురిచేస్తోంది.

Must Read
Related News