Homeబిజినెస్​Today Gold Price | భగ్గుమంటున్న బంగారం ధర..! మళ్లీ ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold Price | భగ్గుమంటున్న బంగారం ధర..! మళ్లీ ఎంత పెరిగిందో తెలుసా..?

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారానికి Gold ఉండే ప్రాముఖ్యం ఎలాంటిదో మ‌నందరికీ తెలిసిందే. మహిళలకు బాగా ఇష్టమైన వస్తువు బంగారం కాగా, దానిని కొనేందుకు చాలా ఆస‌క్తి చూపిస్తూ ఉంటారు.

బంగారం గొప్ప పెట్టుబడి కాగా పోర్ట్‌ఫోలియోకు కూడా ఎంత‌గానో దోహదం చేస్తుంది. ఈ కారణాల వల్ల తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా దీనిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌డం సామాన్యుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గత రెండు వారాలుగా రూ. 98 వేల పరిధిలో ట్రేడ్ అయిన బంగారం ధరలు తిరిగి రూ. లక్ష మార్క్‌ను చేరుకునే దిశగా కదులుతున్నాయి.

Today Gold Price : పసిడి పరుగులు..

నిపుణుల అంచనాల ప్రకారం త్వరలోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షను తిరిగి దాటే అవకాశం కనిపిస్తోంది. సోమవారం (జులై 14) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,700 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,390గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) ప్ర‌కారం చూస్తే .. హైదరాబాద్‌లో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ. 91,540గా ఉన్నాయి. అలానే విజయవాడలో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540, ఢిల్లీలో 24 క్యారెట్లు రూ. 99,850 , 22 క్యారెట్లు రూ.91,540, ముంబయిలో 24 క్యారెట్లు రూ. 99,700, 22 క్యారెట్లు రూ.91,540, వడోదరలో 24 క్యారెట్లు రూ.99,750, 22 క్యారెట్లు రూ.91,440.

కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540, చెన్నైలో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540, బెంగళూరులో (Bangalore) 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540, కేరళలో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540, పుణెలో 24 క్యారెట్లు రూ.99,700, 22 క్యారెట్లు రూ.91,540గా ఉన్నాయి.

ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (1 కిలోకి) చూస్తే.. హైదరాబాద్‌లో (Hyderabad) రూ. 1,20,100, విజయవాడలో రూ.1,20,100, ఢిల్లీలో రూ.1,24,900 , చెన్నైలో రూ.1,24,900 , కోల్‌కతాలో రూ.1,14,900, కేరళలో రూ.1,24,900, ముంబయిలో రూ.1,14,900, బెంగళూరులో రూ.1,14,900, వడోదరలో రూ.1,14,900, అహ్మదాబాద్‌లో రూ.1,14,900 గా ఉన్నాయి. బంగారం డిమాండ్, సరఫరా, ద్రవ్యోల్బణం, రూపాయి-డాలర్ విలువ ఈ అంశాల ఆధారంగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ, త‌గ్గుతూ ఉంటాయి.