Homeబిజినెస్​Gold Price on sep 1 | మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి, వెండి ధ‌ర‌లు.. ల‌బోదిబోమంటున్న...

Gold Price on sep 1 | మ‌ళ్లీ పెరిగిన ప‌సిడి, వెండి ధ‌ర‌లు.. ల‌బోదిబోమంటున్న కొనుగోలుదారులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price on sep 1 | బంగారం ధరలు Gold Price ఎప్పుడు తగ్గుతాయో అని ఎదురు చూస్తున్నవారికి మరోసారి నిరాశే మిగిలింది. మార్కెట్‌లో పసిడి ధరలు నాన్‌స్టాప్‌గా ఎగబాకుతూ రికార్డులు తిరగరాస్తున్నాయి. అంతేకాకుండా, వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది.

గడచిన కొన్ని వారాలుగా ధరలు పెరుగుతున్న ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.. ఆర్థిక అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) విధించిన సుంకాలు తదితర కారణాలతో బులియన్ మార్కెట్‌లో తీవ్ర స్థాయి అస్థిరత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం, వెండిపై ఎక్కువ‌గా మొగ్గు చూపుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగసిపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Gold Price on sep 1 | త‌గ్గేదే లే..

దేశీయంగా బంగారం, వెండి ధరలు (Silver Price) ఎలా ఉన్నాయో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,05,890 గా న‌మోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.97,060గా ట్రేడ్ అయింది.వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,26,100లుగా ట్రేడ్ అయింది. అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో కొంత వ్య‌త్యాసం అయితే ఉంటుంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్‌లో (Hyderabad) 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,05,890గా న‌మోదు కాగా .. 22 క్యారెట్ల బంగారం ధర రూ.97,060గా ట్రేడ్ అయింది. ఇక‌ కిలో వెండి ధర రూ.1,36,100 గా ఉంది.

ఇక విజయవాడ (Vijayawada), విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,05,890గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.97,060గా న‌మోదైంది. వెండి కిలో ధర రూ.1,36,100 లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,06,040గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.97,210 లుగా ట్రేడ్ అయింది. కిలో వెండి ధర రూ.1,26,100గా న‌మోదైంది. ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,05,890గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.97,060గా న‌మోదైంది.

ఇక‌ వెండి ధర కిలో రూ.1,26,100గా ట్రేడ్ అయింది. చెన్నైలో (Chennai) 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,890గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ.97,060 గా ట్రేడ్ అయింది. వెండి ధర కిలో రూ.1,36,100 గా న‌మోదైంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,05,890గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.97,060 గా న‌మోదైంది. వెండి ధర కిలో రూ.1,26,100గా ఉంది. నిపుణుల ప్రకారం, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా కొంతవరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

Must Read
Related News