అక్షరటుడే, హైదరాబాద్: Gold Prices | బంగారం ధరలు Gold Rates వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. అక్టోబరు 1 (2025) న కూడా పసిడి రేటు మరింత పెరిగి పెట్టుబడిదారులకు షాక్ ఇచ్చింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న గోల్డ్ డిమాండ్ వంటి కారణాల వల్ల బంగారం ధరలు విపరీతంగా ఎగసిపడుతున్నాయి.
ఈ రోజు బంగారం ధరలు (అక్టోబరు 1, 2025) చూస్తే.. 10 గ్రాముల ధర (రూ.).. 24 క్యారెట్లు (ప్యూర్ గోల్డ్) రూ. 1,17,450 కాగా, 22 క్యారెట్లు (జ్యూవెలరీ గోల్డ్) రూ. 1,07,660గా ఉంది.
నిన్నటితో పోల్చితే రూ. 1,000 వరకు బంగారం ధర పెరిగింది. ఇది రోజువారీ ధరల పెరుగుదలలో అరుదైన స్థాయిలో నమోదైంది. వ్యాపారులు, జ్యూజెవెలర్ల ముడి పదార్థాల కొనుగోళ్లకు ఉత్సాహంగా ముందుకు రావడంతో ఇది సాధ్యమైంది.
Gold Prices | కొనే పరిస్థితి లేదు..
బంగారం సరసన వెండి కూడా పయనిస్తోంది. నిన్నటితో పోల్చితే వెండి ధరలు Silver Prices రూ.100 మేర పెరిగాయి. ప్రస్తుతం 1 కిలో వెండి ధర సగటున రూ. 1,49,500 వరకు పలుకుతోంది.
దసరా, దీపావళి పండుగలు దగ్గరపడుతున్న తరుణంలో బంగారం కొనుగోళ్లపై ఆలోచించే వారు ఈ ధరల స్థాయిని పరిగణనలోకి తీసుకోవాలి.
వచ్చే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్ బాండ్స్ లేదా ఇతర డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
పసిడి పెట్టుబడిగా భావించే వారికి ఇది సంకేతమేనని భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు. బంగారం ధరలు ఇలా రికార్డు స్థాయిలో చేరుతుండటంతో, బంగారం కొనుగోలుదారులకు ఇది కలిసొచ్చే సమయమా.. లేక మరింత జాగ్రత్త అవసరమా.. అన్నది ఆలోచించాల్సి ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు చూస్తే..
ఢిల్లీ Delhi లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,07,810 గా నమోదైంది.
అలాగే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,450 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,07,660 గా ట్రేడ్ అయింది.
ఇక విజయవాడలో Vijaywada కూడా ఇదే ధర ఉంది. ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,07,660గా ట్రేడ్ అయింది.
చెన్నై Chennai లో 24 క్యారెట్ల (24 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,490 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,610 గా ఉంది.
ఇక బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,450 గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,07,660 గా ట్రేడ్ అయింది.