Homeబిజినెస్​Today Gold price | ప‌సిడి ప్రియుల‌కు ఊర‌ట‌.. కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

Today Gold price | ప‌సిడి ప్రియుల‌కు ఊర‌ట‌.. కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు Gold Price పైపైకి పోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ధ‌ర‌లు ఈ ర‌కంగా పెరుగుతూ పోతున్న క్ర‌మంలో సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నారు. అయితే తాజాగా బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది.

ఎందుకంటే ధరలు నిన్నటితో పోల్చుకుంటే కాస్త త‌గ్గాయి. సెప్టెంబరు 15, 2025న‌ 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,160 కి చేరుకోగా, 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,01,890 గా న‌మోదైంది.

అంటూ నిన్నటి ధరలతో పోల్చితే స్వల్పంగా రూ.10 మాత్రమే తగ్గడం గ‌మ‌నార్హం. మ‌రోవైపు వెండి విష‌యానికి వ‌స్తే ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ. 132,900 కి చేరుకుంది.

Today Gold price | కాస్త త‌గ్గుద‌ల‌..

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

హైదరాబాద్‌ Hyderabad లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,160గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,890 గా ట్రేడ్ అయింది. ఇక వెండి కిలో ధర రూ. 1,42,900 గా ట్రేడ్ అయింది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,11,160గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,01,890 గా ట్రేడ్ అయింది. ఇక‌ వెండి కిలో ధర రూ. 1,42,900 గా న‌మోదైంది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,11,290గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ. 1,02,040 కి చేరుకుంది. ఇక‌ వెండి కిలో ధర రూ. 1,42,900 గా ట్రేడ్ అయింది.

ముంబయి Mumbai లో 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,11,160 కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,890 గా న‌మోదైంది. ఇక వెండి కిలో ధర రూ. 1,42,900 గా ట్రేడ్ అయింది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,700 కి చేరుకోగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,02,190 గా న‌మోదైంది. అలానే వెండి కిలో ధర రూ. 1,42,900 గా ట్రేడ్ అయింది.

ఇక కోల్‌కతా లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,160 గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,01,890 గా ట్రేడ్ అయింది. అలానే వెండి కిలో ధర రూ. 1,42,900 కి చేరుకుంది.

అయితే బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందు ఓసారి ధ‌ర‌లు ప‌రిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.