అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : ఈ మధ్య బంగారం Gold ధరలు క్రమేపి పెరుగుతూ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. నెల క్రితం లక్ష రూపాయలకు చేరిన బంగారం ధర నేడు రూ. 93 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది. మార్కెట్ పరిస్థితిని చూస్తే.. మరికొన్ని రోజులు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. శుభకార్యాల కోసం బంగారం కొనాలని అనుకునే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొనేయండి. బులియన్ మార్కెట్లో బంగారం ధర ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 9,392, ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,609లుగా ఉంది.
Today Gold Price : ఆలస్యం చేయకండి…
హైదరాబాద్ Hyderabad లో ఈ రోజు 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 86090 ఉంది. మేలిమి బంగారం అయిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఈ రోజు రూ.93,92౦ ఉంది. ఇంచుమించు ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్, నిజామాబాద్, పొద్దుటూరు, రాజమండ్రి, విశాఖ, విజయవాడల్లో ఉంటాయి. చెన్నై లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 86,090గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.93920 ఉంది. దేశ రాజదాని ఢిల్లీ మినహా ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన దేశ ఆర్ధిక రాజధాని ముంబై, కోల్‌కతా, కేరళం, బెంగళూరులో కూడా కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మార్కెట్ మాత్రం పసిడి ధర అన్ని చోట్ల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 86,240 ఉండగా.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 94,070 ఉంది. బంగారం బాటలో నడుస్తూ వెండి ధరలు కూడా వరుసగా నాలుగో రోజు తగ్గుదల కొనసాగాయి. కిలోకు రూ.100 తగ్గి రూ.1,07,900కి చేరుకుంది. గత మార్కెట్ సెషన్‌లో వెండి Silver కిలోకు రూ.1,08,000 వద్ద ముగిసింది. హైదరాబాద్ నగరంలో నిన్న 100 గ్రాముల వెండి ధర 10800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08,000 దగ్గర ట్రేడ్ అయింది. రోజు లాగే ఈ రోజు కూడా 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100 రూపాయలు తగ్గింది.