Homeబిజినెస్​Today Gold Price | మళ్లీ ల‌క్ష‌కి చేరుకున్న బంగారం ధ‌ర‌

Today Gold Price | మళ్లీ ల‌క్ష‌కి చేరుకున్న బంగారం ధ‌ర‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం, వెండి ధ‌ర‌లు చుక్క‌ల‌నంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

రెండు దేశాల పరిస్థితి మెరుగుపడటానికి బదులుగా మరింత దిగజారుతోంది. ఈ క్ర‌మంలో బంగారం, వెండి ధ‌ర‌లు క్రమేపి పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం tula Gold rate 10 గ్రాముల బంగార ధర రూ.99,610 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లక్ష రూపాయల వరకు వెళ్లింది. ఇప్పుడు తులం బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి లక్ష రూపాయలు దాటుతుంది.

Today Gold Price : ఇలా పెరుగుతూ పోతే ఎలా..

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,130 రూపాయల వద్ద ఉంది. అదే అదే సమయంలో వెండి Silver rates కూడా కిలోకు భారీగానే పెరిగింది. నిన్న ఒక్క రోజు రూ.3 వేలకిపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.1,14,100కు చేరుకుంది.

భాగ్య నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం(24-carat gold) ధర రూ.99,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,700 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,610 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,310 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,610 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,310 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,130 వద్ద ఉంది. గతకొన్ని రోజులుగా ఉరుకులు పరుగులు పెడుతూ.. ఎట్టకేలకు మొన్నే లక్ష క్రాస్‌ చేసి ఆల్ టైమ్ హైకి చేరింది వెండి. కమొడిటీ మార్కెట్‌లో Commodity market కిలో వెండి ధర ఏకంగా రూ.3,016 రూపాయలు పెరిగి లక్షా 14వేలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణంతో పాటు ట్రేడర్లు బెట్టింగ్ వేయడం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు నిపుణులు.