HomeUncategorizedGold Price | మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

Gold Price | మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | బంగారం Gold ధ‌ర‌ల‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక రోజు ల‌క్ష వ‌ర‌కు వెళ్లిన బంగారం ధ‌ర ఆ త‌ర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వ‌స్తుంది. అయితే అమెరికా- చైనా మధ్య కుదిరిన ఒప్పందంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు(Gold Prices) కుప్పకూలాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ కనిపించింది హైదరాబాద్(Hyderabad) మార్కెట్లో తులం బంగారం రేటు రూ.1800ల మేర తగ్గింది. మరి మే 13వ తేదీన తులం బంగారం, కిలో వెండి రేటు ఏ విధంగా ఉంద‌నేది చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,870లు గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,790లు గా కొనసాగుతోంది. అయితే ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, విశాఖ పట్నం, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ ల్లో కూడా కొనసాగుతున్నాయి.

Gold Price | త‌గ్గిన ధ‌ర‌లు

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88790లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 9 6,870లు గా కొనసాగుతోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి(Mumbai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88790లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 9 6,870లు గా కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో New Delhi 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88 940లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 97,020లు గా కొనసాగుతోంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88,790లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 9 6,870లుగా కొనసాగుతోంది.

బెంగళూరు(Bangalore) లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88,790లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 9 6,870లు గా కొనసాగుతోంది. కేరళ Kerala లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 88,790లు ఉండగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 9 6,870లు గా కొనసాగుతోంది.

బంగారం బాటలోనే పయనిస్తూ వెండి ధరలు(Silver Prices) కూడా దిగి వస్తున్నాయి. వరసగా కొన్ని రోజులుగా వెండి ధర నేల చూపు చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్కెట్ లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,08,900లు గా కొనసాగుతోంది. మ‌హిళ‌లు బంగారం లేదా వెండి కొనాలి అనుకుంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొనేసుకోండి.