Homeబిజినెస్​Today gold price | మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. మ‌హిళ‌ల‌కు ఇది బ్యాడ్...

Today gold price | మ‌ళ్లీ క్ర‌మంగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. మ‌హిళ‌ల‌కు ఇది బ్యాడ్ న్యూసే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉండ‌డం లేదు. ఒక రోజు స్వ‌ల్పంగా తగ్గి ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌రుగులు పెడుతుంది. అంత‌ర్జాతీయంగా ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల‌ని బట్టి బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు ఉంటాయి. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌, వచ్చే పండుగల నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది కాస్త సాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఆపరేషన్ సింధూర్(Operation sindoor) పేరిట పాకిస్తాన్ ఉగ్రవాద శిక్షిణా శిబిరాల పైన భారత వైమానిక దళం(Indian airforce) దాడులు చేయ‌డంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా భారీగానే కనిపించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం కూడా లేక‌పోలేదు అంటున్నారు.

Today gold price | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి..

మే 7వ తేదీ బుధవారం Wednesday బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,847లకు చేరుకుంది. అదే క్రమంలోనే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. రూ.9,026లు పలుకుతోంది. ఇక,18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రు.7,385లకు అమ్ముడవుతోంది.చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,470 వద్ద కొనసాగుతుంది. అలాగే ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,470 వద్దకు చేరింది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.90,410కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,620 వద్ద కొనసాగుతుంది.కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.98,470కు చేరింది.బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.90,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,470 వద్ద కొనసాగుతుంది.ఇకపోతే, వెండి Silver ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో వెండి ధర గ్రాముకు రూ.107.80 లు కాగా, కిలో వెండి ధర రూ.1,07,800గా ఉన్నాయి. ఉద‌యం వ‌ర‌కు ఈ రేట్లు ఉండ‌గా, త‌ర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకొనే అవ‌కాశం ఉంది.