ePaper
More
    Homeబిజినెస్​Gold Prices Today | ఈరోజు బంగారం ధ‌ర‌లు.. తులం ఎంతంటే?

    Gold Prices Today | ఈరోజు బంగారం ధ‌ర‌లు.. తులం ఎంతంటే?

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Gold Prices Today | ఈ మ‌ధ్య ప‌సిడి ధ‌ర‌ల‌లో హెచ్చుత‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఒకసారి పెర‌గ‌డం, మ‌రోసారి త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతోంది. బంగారం Gold purchase కొనుగోలు విషయంలో ఆభరణాల తయారీ ఖర్చులు, పన్నులు, ఇతర ఛార్జీలు ధరలపై ప్రభావం చూపించే అవ‌కాశం ఉంది. దీంతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల, కేంద్ర ప్రభుత్వ విధానాలు వంటి అనేక అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.

    ఏప్రిల్ నెలలో లక్ష దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రూ.95 వేల వరకు దిగొచ్చిన పసిడి ధర.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే రూ.98 వేల వరకు చేరుకుంది.

    Gold Prices Today | స్థిరంగానే రేట్లు..

    తాజాగా, బంగారం, వెండి Silver ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జూన్ 1, 2025 ఆదివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.97,310 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,200లు పలుకుతోంది. వెండి కిలో ధర రూ.99,900గా ఉంది.

    హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310 గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,200గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. విజయవాడ (Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ. 89,200గా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,900లు పలుకుతోంది.

    ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,460, 22 క్యారెట్ల ధర రూ.89,350గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ. 99,900. ముంబయిలో 24 క్యారెట్ల ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ.89,200గా ఉంది. వెండి ధర కిలో రూ.99,900.

    చెన్నైలో Chennai 24 క్యారెట్ల ధర(24 carat gold price) రూ.97,310, 22 క్యారెట్ల ధర రూ. 89,200గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,900. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,310, 22 క్యారెట్ల ధర(22 carat gold price) రూ.89,200గా ఉంది. వెండి ధర కిలో రూ. 99,900.

    బులియన్ మార్కెట్‌(bullion market)లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే, ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...