Homeబిజినెస్​Today Gold Prices | రూ. 1.10 లక్షలకి చేరువలో ప‌సిడి ధ‌ర‌.. రానున్న రోజులలో...

Today Gold Prices | రూ. 1.10 లక్షలకి చేరువలో ప‌సిడి ధ‌ర‌.. రానున్న రోజులలో మరింత పెరిగే ఛాన్స్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Prices : బంగారం ధ‌ర‌లు Gold Price భ‌గ్గుమంటున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ప‌సిడి ధ‌ర‌లు ఉరుకులు పెడుతున్నాయే త‌ప్ప త‌గ్గిన దాఖలాలు లేవు.

ప్రస్తుతం తులం బంగారం అన్ని ట్యాక్స్‌లు క‌లుపుకొని దాదాపు రూ. లక్షా 7 వేలకుపైనే ఉంది. బంగారానికి మన భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఇస్తుండ‌టం, మ‌రోవైపు పండ‌గ సీజ‌న్ లో ఇలా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుండ‌టం సామాన్యుల‌కి ఏ మాత్రం మింగుడు ప‌డ‌టం లేదు.

సెప్టెంబరు 5వ తేదీన దేశంలో బంగారం ధరలు విష‌యానికి వ‌స్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా ట్రేడ్ అయింది.

ఇక వెండి విషయానికొస్తే కిలోకు Silver KG రూ.1 లక్షా 26,900గా న‌మోదైంది. అదే హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో భారీగా ఉంది. రూ.1 లక్షా 36,900గా ట్రేడ్ అయింది.

Today Gold Prices :

నిన్న 100 గ్రాముల వెండి ధర Silver Price రూ.13,700ల దగ్గర ట్రేడ్ కాగా, కేజీ వెండి ధర రూ.1,37,000గా న‌మోదైంది.

ఈరోజు మాత్రం 100 గ్రాములపై రూ.10, కేజీపై రూ.100లు తగ్గ‌డం కొంత ఉప‌శ‌మనాన్ని ఇచ్చింది. ఈరోజు 100 గ్రాముల వెండి ధర రూ.13,690 దగ్గర ట్రేడ్ అవుతుండ‌గా, కేజీ వెండి ధర రూ.1,36, 900గా న‌మోదైంది.

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం Gold ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

ఢిల్లీ Delhi లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,000గా ట్రేడ్ అవుతుండ‌గా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా న‌మోదైంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా న‌మోదైంది.

Today Gold Prices :

ఇక హైదరాబాద్‌లో Hyderabad 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా ట్రేడ్ అయింది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా ట్రేడ్ అయింది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా న‌మోదైంది.

కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940గా ట్రేడ్ అయింది. ప‌సిడి క‌న్నా వెండి ధ‌ర‌లు కాస్త త‌గ్గుతూ వ‌స్తున్నాయి.