అక్షరటుడే, హైదరాబాద్: Gold and silver prices | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు పసిడి ధరలు ఇంకా పెరుగుతాయని సూచిస్తున్నారు.
“రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్ international market లో బంగారం వాణిజ్యం పెరుగుతుండడంతో దేశీయంగా రేట్లు రూ.1.20 లక్షల దాకా వెళ్లే అవకాశం ఉంది” అని విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి మార్కెట్ gold market లో మరోసారి చరిత్ర సృష్టించేలా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భౌగోళిక రాజకీయ Geopolitical ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, డాలరు బలపడటం, రూపాయి విలువ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధర Gold Price పెరగడానికి దోహదపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అక్టోబరు 6, 2025 (సోమవారం) నాటికి భారత బంగారం మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,390 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగి రూ. 1,09,440 కు చేరుకుంది. బంగారం పెరుగుదలతో పాటు వెండి ధరల్లో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది.
Gold and silver prices | తగ్గేదే లే..
పెరుగుదలకు ప్రధాన కారణాలు.. రష్యా-ఉక్రెయిన్ పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులవైపు మళ్లిస్తున్నాయి.
డాలరు విలువ పెరగడంతో ఇతర కరెన్సీలలో బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. దసరా, దీపావళి సీజన్ ప్రారంభం కావడంతో గోల్డ్ జ్యువెలరీ కొనుగోళ్లు పెరిగాయి.
ఈరోజు (అక్టోబరు 6) దేశవ్యాప్తంగా బంగారం ధరలు (10 గ్రాములకు) 24 క్యారెట్ 24 carat gold (రూ.) | 22 క్యారెట్ 22 carat gold (రూ.) పరంగా చూస్తే..
- హైదరాబాద్ రూ. 1,19,390 – రూ. 1,09,440
- విజయవాడ రూ. 1,19,390 – రూ. 1,09,440
- ఢిల్లీ రూ. 1,19,540 – రూ. 1,09,590
- ముంబయి రూ. 1,19,390 – రూ. 1,09,440
- వడోదర రూ. 1,19,440 – రూ. 1,09,490
- కోల్‌కతా రూ. 1,19,390 – రూ. 1,09,440
- చెన్నై Chennai రూ. 1,19,390 – రూ. 1,09,440
- బెంగళూరు రూ. 1,19,390 – రూ. 1,09,440
- కేరళ రూ. 1,19,390 – రూ. 1,09,440
- పుణె రూ. 1,19,390 – రూ. 1,09,440 గా నమోదైంది.
ఇక వెండి ధరల్లో Silver Prices స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. దేశంలో (కిలోకు) వెండిధర ఎలా ఉందని చూస్తే..
- హైదరాబాద్ రూ. 1,64,900
- విజయవాడ రూ. 1,64,900
- ఢిల్లీ రూ. 1,54,900
- చెన్నై రూ. 1,64,900
- కోల్‌కతా రూ. 1,54,900
- కేరళ రూ. 1,64,900
- ముంబయి రూ. 1,54,900
- బెంగళూరు రూ. 1,54,900
- వడోదర రూ. 1,54,900
- అహ్మదాబాద్ రూ. 1,54,900 గా నమోదైంది.
మొత్తానికి, అక్టోబరు మొదటి వారంలోనే బంగారం మార్కెట్ కొత్త రికార్డులు సృష్టించింది. పండుగ సీజన్‌లో మరిన్ని పెరుగుదలలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.