Homeబిజినెస్​Gold and Silver Prices | ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధ‌ర.. ఈ...

Gold and Silver Prices | ఆకాశ‌మే హ‌ద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధ‌ర.. ఈ రోజు ఎంతంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Gold and Silver Prices |బంగారం ధరలు Gold Price రోజురోజుకీ పెరుగుతూ సాధారణ వినియోగదారులను, ఆభరణాల jewelry కొనుగోలు దారులను భ‌య‌బ్రాంతులకి గురిచేస్తున్నాయి.

భౌగోళిక రాజకీయ geopolitical ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, డాలరు dollar తో పోల్చితే రూపాయి విలువ పడిపోవడం లాంటి అంశాల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపిస్తున్న క్ర‌మంలో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది.

అక్టోబరు 3, 2025 – బంగారం ధరలు (Gold Rates Today) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. 24 క్యారెట్ల బంగారం 24 carat gold (10 గ్రాములు) రూ. 1,18,680 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం 22 carat gold (10 గ్రాములు) రూ. 1,08,790 గా ఉంది.

Gold and Silver Prices | భ‌య‌పెట్టిస్తున్న బంగారం..

దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌రలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. చెన్నైలో Chennai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,450 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,09,490 గా ట్రేడ్ అయింది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,830 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,940 గా ట్రేడ్ అయింది.

ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18, 680 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,790 గా న‌మోదైంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,790 ఉంది.

విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,680 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,790 గా న‌మోదైంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,680 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,08,790 గా న‌మోదైంది.

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు కాస్త తగ్గినప్పటికీ కూడా దీని వ‌ల‌న ఒరిగేదేమి లేదంటున్నారు. ఇక, బంగారం తో పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతుండ‌టం గుబులు రేపుతోంది.

వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కేజీ ధర లక్షన్నర దాటింది. దేశంలో ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. ఒక గ్రాము రూ.164.10 గా ఉండగా, వెండి కిలో ధర రూ. 1,64,100 గా ఉంది.