Homeబిజినెస్​Today Glod Prices | ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధ‌ర‌.. ఆ ప్ర‌భావంతో రికార్డు స్థాయిలో...

Today Glod Prices | ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధ‌ర‌.. ఆ ప్ర‌భావంతో రికార్డు స్థాయిలో పెరుగుదల!

Today Glod Prices | బంగారం ధరలు తగ్గేలా కనిపించడం లేదు. పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఈ రేంజ్‌లో బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుంటే సామాన్యులు దాని గురించి ఆలోచించ‌డానికి వెనుక‌డుగు వేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Glod Prices | బంగారం ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రేంజ్‌లో బంగారం ధ‌ర‌లు పెరుగుతూ పోతుంటే సామాన్యులు దాని గురించి ఆలోచించ‌డానికి కూడా వెనుక‌డుగు వేస్తున్నారు.

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు Gold Price రోజు రోజుకీ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. అక్టోబరు 12, 2025 నాటికి 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080కు చేరుకుంది.

ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరగా నిలిచింది. అదే సమయంలో, 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,14,650గా ఉంది. 18 క్యారెట్ బంగారం కూడా పది గ్రాములకు రూ.93,810కి చేరింది.

ఈ స్థాయిలో ధరలు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం బంగారమే కాకుండా ఇతర విలువైన లోహాల ధరలు కూడా భారీగా పెరిగాయి.

ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,80,000కు చేరగా, 10 గ్రాముల ప్లాటినం platinum ధర రూ.45,420గా ఉంది. వీటన్నింటి వెనుక గ్లోబల్ ఈవెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Today Glod Prices | పైపైకి ధ‌ర‌లు..

ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ రాజకీయాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump చైనా China పై విధించిన భారీ సుంకాలు మార్కెట్లను ఊపేస్తున్నాయి.

చైనాపై China 100 శాతం దిగుమతి సుంకాల విధింపు, కీలక సాఫ్ట్‌వేర్ ఎగుమతులపై ఆంక్షలు వంటి నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, మదుపర్లు మళ్లీ సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లను వదిలి బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతుండటంతో ధరలు ఎగబాకుతున్నాయి. దేశీయంగా దసరా, దీపావళి వంటి పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, గోల్డ్ జువెలరీల డిమాండ్ సహజంగానే పెరుగుతోంది.

అయితే ప్రస్తుత ధరలను చూస్తే, సామాన్య వినియోగదారులకు ఇది తీవ్రమైన భారంగా మారే అవకాశం ఉంది. వ్యాపారులు కూడా అధిక ధరల వలన అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలన్నింటిలోనూ 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,25,460 కాగా, 22 క్యారెట్ రూ. 1,15,000 , 18 క్యారెట్ రూ. 95,000గా ఉంది.

ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ Hyderabad, కేరళ, పుణె నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,25,080 , 22 క్యారెట్ రూ. 1,14,650 , 18 క్యారెట్ రూ. 93,810గా నమోదైంది.

ఢిల్లీలో వరుసగా రూ. 1,25,230 , రూ. 1,14,800 , రూ. 93,960గా ఉన్నాయి. వడోదర, అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ ధర రూ. 1,25,130 , 22 క్యారెట్ రూ. 1,14,700, 18 క్యారెట్ రూ. 93,860 గా ఉంది.

ఇక వెండి ధరల్లోనూ పెరుగుద‌ల‌ కనిపిస్తుంది. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ. 1,90,000గా ఉంది. బెంగళూరులో రూ. 1,82,300గా ఉంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, వడోదరా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో రూ. 1,80,000గా ఉంది.