అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Silver Prices | బంగారం, వెండి ధరలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. పసిడి పేరు తీస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఇటీవల భారీగా పెరిగాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana)లోని హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో స్వల్పంగా పెరిగిన ధరలు ఇప్పుడు మాత్రం వేలు వేలు పెరుగుతూ సామాన్యుడి చేతికి అందకుండా మారాయి.
Gold Silver Prices | దూసుకుపోతున్న ధరలు..
జనవరి 26న దేశీయంగా బంగారం, వెండి ధరలు (Silver Prices)అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టినా, ఆ తగ్గుదల వినియోగదారులకు ఊరటనిచ్చే స్థాయిలో మాత్రం లేదు. పెరిగినప్పుడు వేలల్లో పెరిగే ధరలు, తగ్గినప్పుడు పదుల్లో తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తులం బంగారం ధర (Gold Price)పై కేవలం రూ.10 మాత్రమే తగ్గడం, వెండి కిలోపై రూ.100 మాత్రమే తగ్గడం చూస్తే ‘ఇదేం తగ్గుదల?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర Gold Price రూ.1,46,890 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికొస్తే దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.3,34,900గా ట్రేడవుతుండగా, హైదరాబాద్లో మాత్రం ఇతర నగరాల కంటే ఎక్కువగా రూ.3,64,900 వద్ద ఉంది.
నగరాల వారీగా చూస్తే హైదరాబాద్ (Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,250, 22 క్యారెట్ల ధర రూ.1,46,890గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,400 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,040గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,60,250, 22 క్యారెట్ల ధర రూ.1,46,890గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,480గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,60,250, 22 క్యారెట్ల ధర రూ.1,46,890 వద్ద ట్రేడవుతోంది. దేశవ్యాప్తంగా ఒకే బంగారం రేటు (Gold Rate) ఉండదని, స్థానిక పన్నులు, నగల తయారీ ఛార్జీలు, డిమాండ్–సప్లై వంటి అనేక అంశాలపై ధరలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దక్షిణ భారత నగరమైన చెన్నైలో బంగారం ధరలు వేగంగా మారుతుండగా, వెండి ధరలు హైదరాబాద్, చెన్నై, కేరళలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు.