Homeబిజినెస్​Gold Prices on august 23 | గోల్డెన్​ న్యూస్​.. ఈ రోజు పసిడి ధర...

Gold Prices on august 23 | గోల్డెన్​ న్యూస్​.. ఈ రోజు పసిడి ధర ఎంత త‌గ్గిందంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on august 23 : దేశవ్యాప్తంగా బంగారం ధరల‌లో Gold Price హెచ్చుత‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు తాజాగా మరోసారి తగ్గాయి.

ఆగస్టు 23వ తేదీన బంగారం ధర నిన్నటితో పోలిస్తే సుమారు రూ.250 వరకు తగ్గింది. ఇటీవల లక్షా 5 వేల రూపాయల వరకు వెళ్లిన బంగారం.. ఇప్పుడు లక్ష రూపాయల వద్దకి చేరుకుంటుండడం వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది.

కానీ, ఇది తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజు తగ్గితే మరో రోజు రెట్టింపు రేటుతో పెరగటం మూలంగా మార్కెట్లో అస్థిరత నెలకొంది. చాలా మంది బంగారం ధర కనీసం రూ.90,000 వరకైనా వ‌స్తుందేమో అనే ఆశ‌తో ఎదురు చూస్తున్నారు.

Gold Prices on august 23 : కాస్త ఉప‌శ‌మ‌నం…

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ (crude oil) ధరలు, ఆర్బీఐ పాలసీలు వంటి అనేక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దీనితో పాటు దేశీయంగా కూడా వివాహ, పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగే అవకాశముండడం.. ధరలు పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • ఢిల్లీలో Delhil 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,670గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,290 వద్ద కొనసాగుతోంది.
  • ముంబయి MUmbai లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా న‌మోదైంది.
  • హైదరాబాద్‌ Hyderabad లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ఉంది.
  • విజయవాడ Vijayawada లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా న‌మోదైంది.
  • బెంగళూరు Bengaluru లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ట్రేడ్ అయింది.
  • కోల్‌కతా Kolkata లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ట్రేడ్ అయింది.
  • చెన్నైలో Chennai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ట్రేడ్ అయింది.

ఇక బంగారం ధర తగ్గితే వెండి స్వల్పంగా పెరిగి కిలోకు ప్రస్తుతం రూ.1,18,100గా ట్రేడ్ అవుతోంది.