అక్షరటుడే, హైదరాబాద్: GOLD AND SILVER PRICES | భారతీయులకు బంగారం Gold అంటే ప్రత్యేకమైన అభిరుచి ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరిస్తారు. పండగల సమయంలో బంగారం కొనడం శుభమని భావించే అలవాటు ఉన్నందున దసరా, దీపావళి వంటి సందర్భాల్లో గిరాకీ మరింత పెరుగుతుంది.
ప్రస్తుతం దసరా ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం డిమాండ్ పెరిగింది. అయితే ఈ వేళ దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.
రెండు రోజుల క్రితం బంగారం ధర ఆల్‌టైమ్ హై స్థాయిని తాకగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలను తోసిపుచ్చిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
GOLD AND SILVER PRICES | పడిపోయిన ధరలు..
ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా చూపబడటంతో వరుసగా ధరలు తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 26న హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి గాను ముందరు రోజు రూ.320 తగ్గి నేడు మరో రూ.930 తగ్గింది. మొత్తంగా రూ.1250 మేర పడిపోయి తులం ధర రూ.1,14,440కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి తులం ధర రూ.1,04,900 వద్ద నిలిచింది . వెండి మాత్రం గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతోంది. హైదరాబాద్ Hyderabad మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద స్థిరంగా ఉండగా, ముంబై, ఢిల్లీ, పుణె, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3744 డాలర్ల వద్ద స్వల్పంగా పెరిగి ట్రేడవుతుండగా, స్పాట్ సిల్వర్ రేటు 2.32 శాతం పెరిగి ఔన్సుకు 44.96 డాలర్ల వద్ద ఉంది.
భారత రూపాయి Indian Rupee మారకం విలువ ప్రస్తుతం 88.767 వద్ద ట్రేడవుతోంది. సెప్టెంబర్ 26 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ఈ రేట్లు మధ్యాహ్నానికి మారే అవకాశం ఉండగా, ట్యాక్సులు మరియు ప్రాంతాలవారీగా ధరల్లో తేడాలు కనిపించవచ్చు. ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ బంగారం ధరలు చూస్తే.. ముంబైలో రూ.1,14,430, రూ.1,04,890, చెన్నైలో రూ.1,14,650, రూ. 1,05,090 కాగా, కోల్‌కతాలో రూ.1,14,430, రూ. 1,04,890, బెంగళూరులో రూ.1,14,430, రూ. 1,04,890, ఢిల్లీలో రూ.1,14,580, రూ. 1,05,040, హైదరాబాద్, విజయవాడలో రూ.1,14,430, రూ. 1,04,890, పూణేలో రూ.1,14,430, రూ. 1,04,890గా ట్రేడ్ అయింది.