HomeUncategorizedGold Price | ఆల్ టైమ్ హైకి చేరుకున్న ప‌సిడి ధ‌ర‌.. ఇక సామాన్యుల‌కు క‌ష్ట‌కాల‌మే..!

Gold Price | ఆల్ టైమ్ హైకి చేరుకున్న ప‌సిడి ధ‌ర‌.. ఇక సామాన్యుల‌కు క‌ష్ట‌కాల‌మే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | పసడి ప్రియులకు, పెట్టుబడిదారులకు మరోసారి షాక్‌. బంగారం  ధరలు రోజు రోజుకూ చుక్క‌లు చూపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో ఇప్పటికే రూ.5,000కి పైగా పెరిగిన గోల్డ్ రేట్లు, సెప్టెంబర్ మొదటివారంలో కూడా అదే వేగంతో పెరుగుతుండడం గమనార్హం.

ఈ రోజు బంగారం ధ‌ర‌లు చూస్తే.. 24 క్యారట్ బంగారం (10 గ్రాములు) రూ.210 పెరిగి రూ.1,06,090  కాగా.. 22 క్యారట్ బంగారం (10 గ్రాములు) రూ.200 పెరిగి రూ.97,250కు చేరింది. 18 క్యారట్ బంగారం (10 గ్రాములు) రూ.160 పెరిగి రూ.79,570గా  న‌మోదైంది. గత వారం రోజుల్లో బంగారం ధరలు (Gold Rates) సుమారు రూ4,500 వరకూ పెరగడం గమనార్హం. వినియోగదారులు, డీలర్లు ఈ ధరల పెరుగుద‌ల‌తో గ‌గ్గోలు పెడుతున్నారు.

Gold Price | భ‌గ్గుమంటున్న బంగారం..

బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 2న కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,36,100కి చేరుకుంది. గత 10 రోజుల్లో వెండి ధర (Silver Price) రూ.6,000కి పైగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (MCX) లెక్కల ప్రకారం, గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 0.41 శాతం అంటే రూ.430 పెరిగి రూ.1,05,215 ధరగా న‌మోద‌వుతుంది. ఇక సెప్టెంబర్ సిల్వర్స్ ఫ్యూచర్స్ ధర 0.49శాతం అంటే రూ.605 పెరిగి రూ.1,23,240 ధరలో ట్రేడ్ కానుంది. ధరల పెరుగుదలకు కారణాలు చూస్తే.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గుతుందన్న అంచనాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, రుణ వ్యయాలపై ఊహాగానాలు అని మెహతా ఈక్విటీస్ VP రాహుల్ కలాంత్రి తెలిపారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధానాలకు చట్టపరమైన వ్యతిరేకత రావ‌డం, ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తి చుట్టూ ప‌లు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం, ముఖ్యంగా గవర్నర్ లిసా కుక్‌ను తొలగించే ప్రయత్నాల దృష్ట్యా, పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబ‌డి పెడుతున్నార‌ని చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కొనుగోళ్లకు ముందు వాస్తవ ధరలను పరిశీలించి, సరైన సమయంలో డిసిషన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Must Read
Related News