Homeబిజినెస్​Today Gold Price | ఆల్‌టైం గరిష్టానికి చేరువలో బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత...

Today Gold Price | ఆల్‌టైం గరిష్టానికి చేరువలో బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం (Gold) అంటే ఎవరికైనా మక్కువే.. మహిళలకు అయితే మరీ ప్రత్యేకంగా! ఏ చిన్న శుభకార్యమైనా బంగారం కొన‌కుండా వేడుక జ‌రుపుకోవ‌డం అసాధ్యం. ముఖ్యంగా శ్రావణ మాసం రోజుల్లో పెళ్లిళ్లు, వరుస శుభకార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

దీంతో చాలామంది బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ రోజు బంగారం ధర కొద్దిగా పెరిగింది. రోజురోజుకు మారుతున్న మార్కెట్ రేట్లను బట్టి బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి కానీ, శ్రావణ మాసంలో డిమాండ్ పెరగడం వల్ల ధరలపై ప్రభావం పడటం సహజమే.

Today Gold Price : కొండెక్కిన ధ‌రలు..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,560 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 94,010గా న‌మోదైంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,17,100 గా న‌మోదైంది. ఈ ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొన‌సాగుతోంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి Silver ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • హైదరాబాద్​(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి (1 కిలో) రూ. 1,27,100గా ట్రేడ్ అయింది.
  • ఇక ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,710 , 22 క్యారెట్ల బంగారం రూ. 94,160 , వెండి రూ. 1,17,100గా ట్రేడ్ అయింది.
  • చెన్నై(chennai)లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010 , వెండి రూ. 1,27,100 గా న‌మోదైంది.
  • ఇక ముంబయి(Mumbai)లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560 , 22 క్యారెట్ల బంగారం రూ. 94,010 , వెండి రూ. 1,17,100గా న‌మోదైంది.
  • బెంగళూరు(Bengaluru)లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,02,560, 22 క్యారెట్ల బంగారం రూ. 94,010, వెండి రూ. 1,17,100గా ట్రేడ్ అయింది.

అయితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడానికి ప్రధానంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య అంశాలు తీవ్రతరం కావడం అని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్లు, అమెరికా అప్పులు 36 ట్రిలియన్ డాలర్లకు చేరడం వంటి అంశాలు బంగారం, వెండి ధ‌రలు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెబుతున్నారు.

ధరల పెరుగుదలతో ఆభరణాల విక్రయాలు కొంత తగ్గాయి అనే చెప్పాలి. అత్యంత అవ‌స‌ర‌మైన‌ చాలా మంది కస్టమర్లు 18 లేదా 14 క్యారెట్ల ఆభరణాలని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

Must Read
Related News