More
    Homeబిజినెస్​Gold and Silver Price | ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు .. ఇక...

    Gold and Silver Price | ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు .. ఇక ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold and Silver Price | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు Silver Prices దూసుకుపోతున్నాయి. వరుసగా గరిష్ట స్థాయిలకు చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో ముడి ధరలు పెరగడం, రూపాయి బలహీనత, మార్కెట్లో లభ్యతపై ప్రభావం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ 17 ఉద‌యం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,194కి చేరుకోగా, 22 క్యారెట్ 10 గ్రాములకు రేటు రూ.1,02,610గా న‌మోదైంది. నిన్నటి ధరలతో పోల్చితే, స్వల్పంగా పెరిగింది అని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.1,44,100కి చేరుకోవ‌డంతో సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నారు. వెండి ధ‌ర‌లు నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.

    Gold and Silver Price | పైపైకి పోతున్న ధ‌ర‌లు..

    దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు Gold Prices ఎలా ఉన్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,194గా ట్రేడ్ అయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,02,610గా న‌మోదైంది. ఇక ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,194కి చేరుకోగా , 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,02,610గా న‌మోదైంది. ఇక‌ ఢిల్లీలో 24 క్యారెట్ రేటు రూ.1,12,090కి చేరుకోగా, 22 క్యారెట్‌కు రూ.1,02,760గా న‌మోదైంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,12,160గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,02,810గా నమోదైంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,11,940గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,02,610గా న‌మోదైంది.

    ఇక బెంగళూరులో Bangalore 24 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,11,940గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌ రూ.1,02,610గా న‌మోదైంది.. ఇప్పుడు చెప్పుకున్న ధ‌రలు స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల మీద ఆధారపడి స్వల్పంగా మారుతుంటాయి. అయితే వెండి ధ‌ర‌లు కూడా క్ర‌మంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, కేరళ, చెన్నైలో కిలో వెండి రూ.1,44,100కి చేరుకోగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పూణేలో రూ.1,34,100గా న‌మోదైంది. ఇటీవ‌ల ధ‌ర‌లు క్ర‌మేపి పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు దారులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. పండుగల వేళ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

    More like this

    CM Revanth Reddy | డ్రగ్స్ దందాలో ఎంత పెద్దోళ్లు ఉన్నా వదిలిపెట్టం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని...

    Mahesh Babu | లిటిల్ హార్ట్స్ మూవీపై మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. గాల్లో తేలుతున్న టీమ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahesh Babu | చిన్న బడ్జెట్‌తో రూపొందిన లిటిల్ హార్ట్స్ (Little Hearts) సినిమా...

    Pm modi birthday | ప్రధాని మోదీ బహుమతుల వేలం ప్రారంభం.. గంగా శుద్ధికి వినూత్న కృషి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pm modi birthday | ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi 75వ పుట్టినరోజు...