Homeబిజినెస్​Gold Price on August 18 | మ‌రింత దిగొచ్చిన బంగారం ధ‌ర.. మ‌హిళ‌లు ఇక...

Gold Price on August 18 | మ‌రింత దిగొచ్చిన బంగారం ధ‌ర.. మ‌హిళ‌లు ఇక ఆల‌స్యం చేయ‌కండి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 18 : బంగారం ధ‌ర‌లు Gold Prices కొద్ది రోజులుగా క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గ‌డం మ‌నం గ‌మ‌నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మార్కెట్‌లో అనిశ్చితి కార‌ణంగా దేశంలో బంగారం, వెండి ధరల‌లో కాస్త హెచ్చుత‌గ్గులను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 24-carat pure gold ధర లక్ష రూపాయలను దాటడంతో సామ్యానులు కాస్త జంకుతున్నారు. అయితే ఈ మ‌ధ్య ధ‌ర‌లు క్ర‌మేపి త‌గ్గుతూ వ‌స్తున్నా కూడా రూ.ల‌క్ష‌కు పైనే కొన‌సాగుతోంది.

Gold Price on August 18 : త‌గ్గుతున్న ధ‌ర‌లు..

ఆగస్టు 18, 2025న దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,170గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,740గా ట్రేడ్ అయింది. ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌న‌ది చూస్తే..

  • ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 గా ట్రేడ్ అయింది.
  • హైదరాబాద్‌ (HYderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా న‌మోదు అయింది.
  • విజయవాడ (Vijayawada)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా న‌మోదైంది.
  • బెంగళూరు (Bengaluru)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా ట్రేడ్ అయింది.
  • చెన్నై (Chennai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740గా ట్రేడ్ అయింది.

ఇక వెండి Silver ధర కిలోకు రూ.1,16,100గా న‌మోదు కాగా, హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో కిలోకు 1,26,100 గా ఉంది.

పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారం ధరలు క్రమంగా తగ్గడం కొనుగోలుదారులకు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తున్నాయని చెప్ప‌వ‌చ్చు. రాబోయే పండుగలు, వివాహ సీజన్లు మొదలైన సందర్భాలలో బంగారం కొనుగోలు చేయాల‌నుకునేవారికి ఇది మంచి ప్రోత్సాహంగా ఉంటుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు చెబుతున్నారు.