అక్షరటుడే, హైదరాబాద్: Feb 20 Gold Prices | బంగారం ధరల Gold Rates తగ్గుదలలో వచ్చిన బ్రేక్ ఎక్కువకాలం నిలవలేదు. గురువారం ప్రారంభమైన పెరుగుదల శుక్రవారం కూడా కొనసాగింది. వరుసగా రెండో రోజు ధరలు పెరగడం మార్కెట్ వర్గాలను, ముఖ్యంగా కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుండటంతో పసిడి కొనుగోలు చేసే వారికి ఇది షాకింగ్‌గా మారింది.
అంతర్జాతీయంగా ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తలెత్తడంతో గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు క్రమంగా ఎగబాకుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్ మార్పిడి విలువల్లో మార్పులు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
Feb 20 Gold Prices | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో Hyderabad 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,000 వద్ద కొనసాగుతోంది. గురువారం ఇది రూ.1,56,490గా ఉండగా స్వల్ప మార్పు నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460గా ఉంది. నిన్న ఇది రూ.1,43,450 వద్ద కొనసాగింది.
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,500గా ఉంది. 22 క్యారెట్ల రేటు రూ.1,43,460 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,58,190గా ఉంది. గురువారం ఇది రూ.1,58,180 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.1,45,010గా ఉండగా, నిన్న రూ.1,45,000గా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,500గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,460గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,650గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల ధర రూ.1,43,610 వద్ద స్థిరపడింది.
బంగారంతో పాటు వెండి ధరలు Silver Prices కూడా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,70,100గా కొనసాగుతోంది. గురువారం ఇది రూ.2.70 లక్షల వద్ద ఉంది ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,100గా ఉంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా కేజీ సిల్వర్ ధర రూ.2,70,100 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ధరల పెరుగుదల కారణంగా బడ్జెట్లు పెరగాల్సిన పరిస్థితి నెలకొంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ పరిస్థితులు స్థిరపడే వరకు ధరల్లో అస్థిరత కొనసాగే అవకాశముంది. ఇకపై కూడా గ్లోబల్ మార్కెట్ ట్రెండ్లు, రూపాయి-డాలర్ మార్పిడి విలువలు, జియోపాలిటికల్ పరిణామాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేయనున్నాయి. కొనుగోలుదారులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.