Homeజిల్లాలునిజామాబాద్​SI Srikanth​ | సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త : ఎస్సై శ్రీకాంత్​

SI Srikanth​ | సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త : ఎస్సై శ్రీకాంత్​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SI Srikanth​ | దసరా సెలవుల్లో (Dussehra holidays) ఊరెళ్తే జాగ్రత్తలు పాటించాలని నాలుగో టౌన్ ఎస్​హెచ్ఓ శ్రీకాంత్ (Fourth Town SHO Srikanth) పేర్కొన్నారు.

ఈ మేరకు గురువారం ప్రకటన విడుల చేశారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే ఇరుగుపొరుగు వారిని గమనిస్తూ ఉండాలని చెప్పాలన్నారు.

కాలనీల్లో అపరిచిత వ్యక్తుల సంచారం కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు (local police) సమాచారం అందించాలని సూచించారు. దసరా, నవరాత్రులు, బతుకమ్మ వరుస పండుగల నేపథ్యంలో భారీ నగలు ధరించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని.. వాటి భద్రతపై అత్యంగా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. చైన్ స్నాచింగ్ (chain snatching) జరుగుతున్న దృష్ట్యా అనుమానాస్పద వ్యక్తుల గురించి తెలిస్తే వెంటనే 100కు డయల్​ చేయాలని.. స్థానిక పోలీసులను అలర్ట్​ చేయాలని సూచించారు.

Must Read
Related News