అక్షరటుడే, హైదరాబాద్: Godrej | భారతదేశపు డైవర్సిఫైడ్ అగ్రి-బిజినెస్ దిగ్గజాల్లో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రెజ్ ఆగ్రోవెట్) కొత్తగా మొక్కజొన్న పంట కోసం రూపొందించిన కలుపు నివారణ మందు ‘అశితాకా’ను (Ashitaka) ఆవిష్కరించింది. ఐఎస్కే జపాన్ (ISK Japan) భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేసింది.
దేశంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య అయిన గడ్డి, వెడల్పాటి ఆకులు గల కలుపును సమర్ధవంతంగా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. పంట ప్రారంభ దశలో కలుపు పెరిగిపోవడం వల్ల మొక్కజొన్న దిగుబడిపై (maize yield) గణనీయంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో 2-4 కలుపు ఆకుల దశలో అశితాకాను వాడితే కలుపును నియంత్రించేందుకు సమర్ధవంతంగా పని చేస్తుంది. అంతర్జాతీయంగా మొక్కజొన్న సాగుకు సంబంధించి విస్తీర్ణంపరంగా భారత్ 4వ స్థానంలో, వార్షిక ఉత్పత్తిపరంగా 5వ స్థానంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ, మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మాంసాహార ప్రొటీన్, స్టార్చ్, మరియు మొక్కజొన్నను ఉపయోగించే ఇతరత్రా పారిశ్రామికోత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.
అనేక సంవత్సరాలుగా పశువుల ఆహారం, పరిశ్రమలు (industrial), బయోఫ్యూయల్ అవసరాల కోసం దేశీయంగా మొక్కజొన్నలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. అయితే, నాణ్యమైన విత్తనాలు, ఇతరత్రా ముడివనరుల లభ్యత పరిమితంగా ఉండడం వృద్ధికి ప్రతిబంధకంగా మారడంతో పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు మరో ముప్పుగా పరిణమించాయి. కఠినతరమైన వాతావరణ పరిస్థితులు, మారుతున్న వర్షపాతం తీరుతెన్నులు, పురుగులు, వ్యాధులు మొదలైన మొక్కజొన్న ఉత్పత్తికి అవరోధాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ (Godrej Agrovet) అశితాకాను అందుబాటులోకి తెచ్చింది.
‘మొక్కజొన్న రైతులు (corn farmers) మెరుగైన దిగుబడులు పొందాలంటే పంట ప్రారంభ దశలో కలుపును నియంత్రించడం చాలా కీలకం. కాగా.. భారత్లో ఈ తరహా ఉత్పత్తులకు సంబంధించి తొలిసారిగా అశితాకాను ఆవిష్కరించడం ఒక కీలక ముందడుగు కాగలదు” అని గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) రాజావేలు ఎస్కే (Rajavelu NK) తెలిపారు.
“మొక్కజొన్న పంటలో కలుపును నియంత్రించేందుకు అశితాకా సమర్ధవంతంగా పని చేస్తుంది. నెలలో పరిమితంగా ఉండే తేమ, పోషకాలను మెరుగ్గా ఉపయోగించుకునేందుకు, పూత, గింజలాంటి కీలక దశల్లో మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన మద్దతునిస్తుంది. 2-4 కలుపు ఆకుల దశలో ఎకరాకు 50 ఎంఎల్ అశితాకాకు, 400 ఎంఎల్ సర్ఫెక్టెంట్ను కలిపి వాడాలి. ఇది కలుపును ప్రారంభ దశలోనే నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కలుపు సంబంధ దిగుబడి నష్టాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడం, గింజలు నాణ్యంగా ఉండడం, అలాగే ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో, హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయానికి పటిష్ట రక్షణ కవచంగా మారుతుంది” అని గోద్రెజ్ ఆగ్రోవెట్ జీఎం (Godrej Agrovet GM) (మార్కెటింగ్, క్రాప్ ప్రొటెక్షస్ బిజినెస్) అనిల్ చౌబే తెలిపారు.