ePaper
More
    HomeతెలంగాణGodavari Pushkaras | దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు : సీఎం రేవంత్​

    Godavari Pushkaras | దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు : సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Godavari Pushkaras | గోదావరి పుష్కరాలను దక్షిణ భారత South Indian కుంభమేళా Kumbh Mela గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

    గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు.

    పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

    గోదావరి Godavari పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

    Godavari Pushkaras : బాసర నుంచి భద్రాచలం వరకు

    బాసర basara నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

    ఆలయాల అభివృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.

    ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.

    మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు.

    గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.

    పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

    స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.

    దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.

    పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

    More like this

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...

    Robbery on the road | కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ.. రూ. 40 లక్షలు దోచుకుని పారిపోతుండగా ట్విస్ట్​!

    అక్షరటుడే, హైదరాబాద్: Robbery on the road | దోపిడీ దొంగలు బరి తెగించారు. దారిదోపిడీకి దిగారు. కళ్లల్లో...

    Medak | రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మానవ సంబంధాలు మంట గలిసిపోయాయి. ప్రేమ, వివాహేతర సంబంధాల కోసం కొంత...