Homeక్రైంGodavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

Godavari | గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Godavari | ఆంధ్రప్రదేశ్​లోని కోనసీమ జిల్లా (Konaseema district) ముమ్మిడివరం దగ్గర గోదావరిలో విషాదం చోటు చేసుకుంది.

గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ, రామచంద్రపురం (Kakinada, Ramachandrapuram), మండపేటకు చెందిన యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారు క్రాంతి, పాల్‌, సాయి, మహేష్‌, సతీష్‌, మహేష్‌, రాజేష్‌, రోహిత్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.