అక్షరటుడే, వెబ్‌డెస్క్: viral video : బక్రీద్(Bakrid) సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించిన ప్రస్తుతం నెట్టింట social media వైరల్ అవుతోంది. నెటిజన్ల(netizens)ను కన్నీరు పెట్టిస్తోంది. బలి ఇచ్చే ముందు ఒక మేక తన యజమానిని ప్రేమగా తడుముతూ కౌగిలించుకుని కన్నీరు పెట్టుకొంది. దీంతో అక్కడున్నవారు షాక్ అయ్యారు. ఆ మేకకు పిల్లలతో కూడా అనుబంధం ఉండటంతో వారు సైతం దానిని కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చేశారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న సదరు వీడియోలో.. బలి కోసం సిద్ధం చేసిన మేక బహుశా దాని పరిస్థితి గ్రహించి ఉన్నట్లుంది. దీంతో తన యజమానిని పట్టుకుని తడుముతుంది. ఆయన కూడా దానిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంటారు. అక్కడే ఉన్న ఓ పిల్లవాడు సైతం మేకను చూసి ఏడుస్తూ దానిని హగ్ చేసుకుంటాడు.
మేక యజమాని ఏడుస్తూ దానిని ప్రేమగా లాలిస్తూ, వీపు మీద నిమురుతాడు. మొత్తం మీద, ఈ సీన్ ఎంతగా హృదయ విదారకంగా ఉందంటే, దీనిని చూసిన ప్రతివారు భావోద్వేగానికి లోనవుతారు. మాటలు రాని జంతువు, మనసున్న మనిషి మధ్య బంధంతోపాటు మాటల్లో వర్ణించలేని భావోద్వేగాన్ని ఈ వీడియోలో కళ్లకు కడుతూ చూపెడుతోంది.
షారోజ్ రంజాన్ అనే నెటిజన్ ఈ వీడియోను సోషల్ సైట్ థ్రెడ్‌లో social media thread పోస్ట్ చేశాడు. “బలి ఇచ్చే ముందు మేకను కౌగిలించుకోవడం వల్ల అవి, గాఢంగా భావిస్తాయని, ప్రేమిస్తాయని, విశ్వసిస్తాయనే దానికి ఈ ఘటన రుజువు” అని క్యాప్షన్ పెట్టాడు.