అక్షరటుడే, డిచ్పల్లి: Rotary Club Nizamabad | సమాజానికి సేవ చేయడమే రోటర్లీక్లబ్ ప్రధాన లక్ష్యమని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి పేర్కొన్నారు. శనివారం డిచ్పల్లి (Dichpalli)మండలంలోని ఓ హోటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ (Rotary Club of Gems) ఆధ్వర్యంలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోటరీ సేవలను మరింత విస్తృతపర్చేందుకు సభ్యుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. పేదలకు సాయం చేసేందుకు క్లబ్ సభ్యులు ముందుండాలని సూచించారు. శిక్షణలో తెలంగాణలోని 39 రోటరీ క్లబ్స్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జెమ్స్ క్లబ్ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్, పూర్వ గవర్నర్లు, జెమ్స్ క్లబ్ కార్యదర్శి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.