Homeబిజినెస్​IPO | అదరగొట్టిన జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌.. లిస్టింగ్‌తోనే 49 శాతం లాభాలు

IPO | అదరగొట్టిన జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌.. లిస్టింగ్‌తోనే 49 శాతం లాభాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డు (Main board) ఐపీవోలు కాగా ఒకటి ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ (SME). ఒక మెయిన్‌బోర్డ్‌ ఐపీవో భారీ లాభాలను అందించగా.. మరో మెయిన్‌బోర్డ్‌ ఐపీవో (IPO) నిరాశపరిచింది. ఎస్‌ఎంఈ ఐపీవో నష్టాలతో ప్రారంభమైనా లాభాల బాటపట్టింది.

IPO | తొలిరోజే సూపర్‌ హిట్‌..

ఇన్వెస్టర్ల నుంచి రూ. 460 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీవోకు వచ్చిన జీఎన్‌జీ ఎలక్ట్రానిక్స్‌ (GNG Electronics) అదరగొట్టింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద ఒక్కో ఈక్విటీ షేరు (Equity share) ధర రూ. 237. అయితే రూ. 355 వద్ద 49 శాతం ప్రీమియంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో ఒక లాట్‌పై 7,400 లాభం వచ్చిందన్న మాట. అయితే లిస్టయిన కాసేపటికే షేరు ధర పడిపోయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రూ. 335 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

IPO | 8.86 శాతం నష్టంతో ప్రారంభమై..

మార్కెట్‌ నుంచి రూ. 700 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇండిక్యూబ్‌ స్పేసెస్‌ (Indiqube Spaces) పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 237 కాగా.. రూ. 215 వద్ద బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యింది. లిస్టింగ్‌ సమయంలో 8.86 శాతం నష్టాలను ఇచ్చిన ఈ కంపెనీ.. ఆ తర్వాత మరింత పడిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 11 శాతం నష్టంతో రూ. 210 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

IPO | 2.86 శాతం నష్టంతో మొదలైనా..

టీఎస్‌సీ ఇండియా (TSC India) రూ. 25.89 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగిసింది. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 70 కాగా.. బుధవారం రూ. 68 వద్ద 2.86 శాతం డిస్కౌంట్‌తో (Discount) ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. ఆ తర్వాత వెంటనే రూ. 64.60 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ కొట్టింది. కొద్దిసేపటికే కోలుకుని 71.40 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.